80 మందికి డయేరియా
ఆస్పత్రిలో చేరిక వైద్య సిబ్బందిపై బాధితుల ఫిర్యాదు
దోమకొండ : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన 80 మంది మంగళవారం డయేరియాతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దోమకొం డకు చెందిన గంగామణి, భూదవ్వ, శోభ, శంకర్, మణెమ్మ, రాజశేఖర్, లక్ష్మి, మోహిన్‌పాషా, సనాపి లక్ష్మి, నవీన్, అనురాధ, సరస్వతి, సుజాత, కిషన్‌తో పాటు భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన పద్మ, లింగుపల్లి, తాడ్వాయి, సంఘమేశ్వర్, కోనాపూర్, అంచనూరు, ఇస్సానగర్, అయ్యవారి పల్లెకు చెందిన మరికొందరు వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ఉద యం వచ్చిన డ్యూటీ డాక్టర్ మధ్యా హ్నం వెళ్లిపోగా వైద్యులు ఎవరూ లేకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు, బంధువుల కు భోజనం ఇవ్వలేదని సిబ్బంది తీరును ప్రశ్నించారు.
పరామర్శించిన ప్రజాప్రతినిధులు..
పలువురి అస్వస్థత విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్‌రావ్ ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. డ్యూటీ డాక్టర్ అక్కడికి చేరుకుని వైద్యం అందించారు. కాగా తమకు సరైన వైద్యం అందించడం లేద ని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు భోజనం పెట్టలేదని జెడ్పీటీ సీ సభ్యుడికి వివరించారు. ఆస్పత్రిలో క్లీనింగ్ చేయడానికి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించాలని వారికి సూచించా రు. ఆయనతో పాటు సర్పంచ్ శారద, వార్డుసభ్యులు శ్రీకాంత్, శ్రీనివాస్, రమేశ్, అబ్బయ్య, తదితరులు ఉన్నారు.