Pierce Brosnan
-
రీడ్ అండ్ టేలర్ పుట్టుపూర్వోత్తరాలు
-
‘రీడ్ అండ్ టేలర్’ కన్నీటి కథ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తల పరంపరలో భారత్‌లో చోటుచేసుకున్న మరో కీలక పరిణామం మరుగున పడి పోయింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన, జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్నన్ వాణిజ్య ప్రకటనలతో భారతీయులందరికి సుపరిచితమైన ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ కంపెనీ మే 14వ తేదీన భారత్‌లో శాశ్వతంగా మూతపడింది. పర్యవసానంగా కంపెనీలో పనిచేస్తోన్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. (లాక్డౌన్: తొలి ఐదు వారాలు చితక్కొట్టారు!) స్కాట్లాండ్లో దాదాపు 190 ఏళ్ల చరిత్ర కలిగిన ‘రీడ్ అండ్ టేలర్’ వస్త్రాల కంపెనీకి భారత్‌లో 22 ఏళ్ల చరిత్ర ఉంది. మైసూర్ కేంద్రంగా 1998లో భారత్‌లో వెలిసిన ఈ కంపెనీని ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్ (ఆర్ఎల్ఊఎల్)’గా మంచి గుర్తింపు పొందింది. మగవారి పాయింట్లు, చొక్కాలు, సూట్లు, జాకెట్లు, టై దుస్తులతో ధనిక, మధ్యతరగతి భారతీయులను ఎంతోగానో ఈ బ్రాండ్ ఆకట్టుకుంది. దీన్ని భారత్‌లో స్థాపించిన మాతృ సంస్థ ఎస్ కుమార్స్గా పేరుపొందిన ఎస్ కుమార్స్ నేషన్వైడ్ లిమిటెడ్ (ఎస్‌కేఎన్‌ఎల్)’ కంపెని. (ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్!) రీడ్ అండ్ టేలర్ పుట్టుపూర్వోత్తరాలు స్కాట్లాండ్లో రకారకాల ఉన్నితో వస్త్రాలను తయారు చేసే అలెగ్జాండర్ రీడ్‌కు మంచి పేరుండేది. ఆయన తన వస్త్ర వ్యాపారాన్ని విస్తరించడం కోసం జోసఫ్ టేలర్ అనే బాగా డబ్బున్న ఫైనాన్సియర్‌ను పట్టుకొని ఇద్దరి పేర్లు స్ఫురించేలా ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ పేరుతో బట్టల కంపెనీని ఏర్పాటు చేశారు. ఇదే కంపెనీ బ్రాండ్ భారతీయులకు పరిచయం చేయడం కోసం అప్పటికే భారత్‌లో గుర్తింపున్న ఎస్ కుమార్స్ 1997లో రీడ్ అండ్ టేలర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా 1998లో ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్’ పేరిట కంపెనీనీ ఏర్పాటు చేశారు. (లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...) స్కాట్లాండ్లోని మాతృసంస్థ ‘రీడ్ అండ్ టేలర్’ తరహాలో మొదట జేమ్స్ బాండ్ హీరో యాడ్‌ను కొనసాగించిన ఎస్‌కేఎన్‌ఎల్, 2003లో బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ను తీసుకొచ్చి వాణిజ్య ప్రకటనలను ఇప్పించడంతో బ్రాండ్ పేరు దేశమంతా తెల్సిపోయింది. అప్పటికే మార్కెట్లో అమితాబ్‌కు మంచి డిమాండ్ ఉండడంతో బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనకు బాగా రాయల్టీ చెల్లించాల్సి వచ్చింది. 2008 సంవత్సరంతో ‘రీడ్ అండ్ టేలర్’ కంపెనీని తన ఉప సంస్థగా ఎస్ కుమార్స్ ప్రకటించింది. అందులోని 25.4 శాతం వాటాను సింగపూర్‌లోని జీఐసీ కంపెనీకి 900 కోట్ల రూపాయలకు అమ్మేసింది. దాంతో ‘రీడ్ అండ్ టేలర్’ బ్రాండ్ విలువ 3,540 కోట్ల రూపాయలకు చేరుకోగా, మాత సంస్థ అయిన ఎస్ కుమార్ విలువ 2,240 కోట్ల రూపాయలుగా ఉండింది. 2012 మార్చి నెలలో దాదాపు 470 కోట్ల రూపాయల లాభాన్ని ఎస్ కుమార్ చూపించింది. అప్పటి నుంచి ‘రీడ్ అండ్ టేలర్’కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఆ కంపెనీ తరఫున వెయ్యి కోట్ల రూపాయల పబ్లిక్ ఫండింగ్‌ను సేకరించాలని 2011లోనే ఎస్ కుమార్స్ వ్యూహ రచన చేసింది. ఆ డబ్బుతో దేశవ్యాప్తంగా 15 ఫ్గాగ్షిప్ కార్యక్రమాలు నిర్వహించి 160 ప్రత్యేక షోరూమ్‌లను తెరవాలని ‘రీడ్ అండ్ టేలర్’ నిర్ణయించింది. ఆశించిన పబ్లిక్ ఫండ్‌కు ఆస్కారం లేకపోవడంతో కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు స్వస్తి చెప్పింది. (42 మందికి కరోనా: నోకియా ప్లాంట్ మూత) కంపెనీ నష్టాలవైపు నడుస్తున్న విషయాన్ని గమనించిన ఆర్థిక సంస్థలు 2012 సంవత్సరంలో ఆ కంపెనీలో తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. అదే సమయంలో ఐడీబీఐ బ్యాంక్ తన 14.57 శాతం వాటాను తీసేసుకొని అమ్మేసింది. 2013, మార్చి నెలనాటికి ‘రీడ్ అండ్ టేలర్ ఉప కంపెనీతో సహా ఎస్ కుమార్ కంపెనీ’ అప్పులు 4,484 కోట్ల రూపాయలుగా తేలింది. వాటిలో ఎక్కువ శాతం అప్పులు రీడ్ అండ్ టేలర్ కంపెనీ పేరుతోనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సహా కంపెనీకి అప్పులిచ్చిన వారంతా కంపెనీకి వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఓ పక్క కోర్టు వ్యవహారాలు కొనసాగుతుండగానే 2018 సంవత్సరానికి కంపెనీ అప్పులు ఐదువేల కోట్ల రూపాయలు దాటి పోయాయి. చివరకు క్రెడిటర్లంతా ఓ కమిటీగా ఏర్పడి కంపెనీ ‘లిక్విడేషన్’కు ఆర్జి పెట్టుకున్నారు. ఆ సమయంలో కొత్త ప్రమోటర్‌ను వెతికి తీసుకరావడం ద్వారా కంపెనీని రక్షించేందుకు 200 మంది సభ్యులు గల ‘రీడ్ అండ్ టేలర్ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్’ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. 2019, ఫిబ్రవరి నెలలో ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’ జోక్యం చేసుకొని ఆర్‌టీఐఎల్ ‘లిక్విడేషన్’కు ఆదేశించింది. ఆస్తులను అమ్మేసి వచ్చిన సొమ్మును క్రెడిటర్లకు పంచడాన్ని లిక్విడేషన్ అంటారు. ‘కంపెనీని రక్షించేందుకు గత 14 నెలలుగా నేను శత విధాల కషి చేశాను. లాభం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో లిక్విడేషన్ చేయక తప్పలేదు’ అని లిక్విడేటర్‌గా వ్యవహరించిన రవి శంకర్ దేవరకొండ మీడియాకు తెలియజేశారు. వాణిజ్య ప్రకటనలకు, సెలబ్రిటీలకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కంపెనీ దివాలా తీసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
కొత్త జేమ్స్ బాండ్ హీరో ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : నవంబర్ నెలలో విడుదల కానున్న డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్ చిత్రం ‘బాండ్ 25’ ఆయనకు ఆఖరి బాండ్ చిత్రం కానుంది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ‘నావెల్ ఇంటెలిజెన్స్ డివిజన్’లో పనిచేసిన బ్రిటన్ రచయిత ఐయాన్ ఫ్లెమింగ్, జేమ్స్ బాండ్ నవలల సృష్టికర్త. ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినప్పుడు తారసపడిన పలువురు గూఢచారలను దృష్టిలో పెట్టుకొని జేమ్స్ బాండ్ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన పాత్ర ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’గా కన్నా ‘ప్లేబోయ్’గానే ఎక్కువగా కనిపిస్తుంది. ‘007’ కోడ్ నేమ్ కలిగిన జేమ్స్ బాండ్, ఎం16గా పిలిచే బ్రిటీష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేసే పాత్ర. ఈ పాత్రను ప్రధానంగా తీసుకొని ఐయాన్ ఫ్లెమింగ్ 1953 నుంచి 1966 మధ్య 12 జేమ్స్ బాండ్ నవలలు, రెండు చిన్న కథల సంపుటాలు రాశారు. ఆయన అన్ని నవలలను సినిమాలుగా తీసిన తర్వాత ఆయన చిన్న కథల ఆధారంగా ఇతర రచయితలు బాండ్ నవలలను రాయగా వాటిని కూడా సినిమాలుగా తీశారు. వాటిలో కాసినో రాయల్ (1953), లివ్ అండ్ లెట్డై (1954), మూన్‌రేకర్ (1955), డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ (1956), ఫ్రమ్ రష్యా, విత్ లౌ (1957), డాక్టర్ నో (1958), గోల్డ్ ఫింగర్ (1959), ఫర్ యువర్ ఐస్ ఓన్లీ (1960), థండర్ బాల్ (1961), ది స్పై వూ లవ్డ్ మీ (1963), ఆన్ హర్ మేజెస్ట్రీస్ సీక్రెట్ సర్వీస్ (1963), యూ ఓన్లీ లీవ్ ట్వైస్, (1964), ది మేన్ విత్ గోల్డెన్ గన్ (1965), ఆక్టోపసీ, లీవింగ్ డే లైట్స్ (1966) తదితర నవలు, కథలు సినిమాలుగా వచ్చాయి. ఐయాన్ ఫ్లెమింగ్‌కు కొనసాగింపుగా కింగ్స్లే ఆమిస్, జాన్ పియర్సన్, క్రిస్టోఫర్ వుడ్, జాన్ గార్డనర్ తదితర రచయితలు బాండ్ నవలలు రాశారు. సినిమాలుగా రాకముందే చాలా బాండ్ పుస్తకాలు విశేషంగా అమ్ముడుపోయాయి. మొట్టమొదటి బాండ్ చిత్రాల హీరోగా శాన్ కానరీ ఎంపికయ్యారు. అయితే ఆయన వయస్సు మీరిన స్టంట్ మేన్‌గా కనిపించడంతో ముందుగా ఐయాన్ ప్లెమింగ్‌కు ఆయన నచ్చలేదట. సినిమా విడుదలయ్యాక ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. శాన్ కానరీ చురుకైనా స్కాటిష్ చూపులు, ముఖంలో ఉండే తేజస్సు, ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయన స్టైల్ ఆయన్ని మంచి కరిష్మాటిక్ నటుడిగా నిలబెట్టాయి. దాంతో ఆయన తొలి ఐదు బాండ్ చిత్రాల్లో వరుసగా నటించి, ఆ తర్వాత మరో రెండు బాండ్ చిత్రాల్లో నటించారు. డాక్టర్ నో, ఫ్రమ్ రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్ సినిమాల్లో వరుసగా నటించిన ఆయన కొన్నేళ్ల విరామం అనంతరం డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సే నెవర్ అగేన్ చిత్రాల్లో నటించారు. శాన్ కానరీయే ఇప్పటి వరకు అందరికన్నా ఎక్కువ ఆధరణ పొందిన బాండ్ నటుడిగా చరిత్రలో మిగిలిపోయారు. అంతేకాకుండా ఆయన్ని సినిమా చరిత్రలోనే మూడవ అతి గొప్ప నటుడిగా అమెరికా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఎంపిక చేసింది. 1969లో శాన్ కానరీకి విరామం ఇచ్చి బ్రాండ్ చిత్రాల నిర్మాత బార్బర బ్రొకోలీ ‘ఆన్ హర్ మాజెస్టీస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో 29 ఏళ్ల ఆస్ట్రేలియా నటుడు, మోడల్ జార్జ్ లాజెన్బైని తీసుకున్నారు. బాండ్ చిత్రాల్లో అత్యంత పిన్న వయస్కుడైన లాజెన్బై ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఆ తర్వాత శాన్ కానరీకి నిజమైన వారసుడిగా 1973లో లీవ్ అన్ లెట్ డై సినిమాతో రోజర్ జార్జ్ మోర్ వచ్చారు. ఏడు బాండ్ చిత్రాల్లో నటించిన ఆయన సుదీర్ఘకాలం పాటు అంటే, 12 ఏళ్లపాటు కొనసాగిన బాండ్ హీరోగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇంగ్లీషు నటుడు టిమోతి డాల్టన్ రెండు చిత్రాల్లో, ఐరిస్ నటుడు పియర్స్ బ్రాస్నన్ నాలుగు చిత్రాల్లో, ప్రస్తుత ఇంగ్లీష్ నటుడు డేనియల్ క్రేగ్ ఐదు చిత్రాల్లో నటించారు. వీరంతా శ్వేత జాతీయులు, వారిలో ఎక్కువ మంది ఇంగ్లీషు నటులు. కొత్త జేమ్స్ బాండ్‌కు స్వాగతం పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏ దేశం, ఏ జాతికి చెందిన వ్యక్తయినా తనకు ఫర్వా లేదని బార్బర బ్రొకోలీ ఇటీవల ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాంతో నల్ల జేమ్స్ బాండ్ ఎందుకు ఉండకూడదనే ప్రశ్న తలెత్తింది. ఆకర్షణీయంగా కనిపించే నల్లజాతీయ ఇంగ్లీషు నటుడు ఇద్రీస్ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారు. డెంజల్ వాషింగ్టన్, మోర్గాన్ ఫ్రీమన్, విల్‌స్మిత్ లాంటి నల్లజాతీయులు హాలీవుడ్లో రాణించినప్పుడు ఇద్రీస్ ఎల్బా ఎందుకు రాణించరని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్వేతజాతీయుడి స్థానంలో ఓ నీగ్రోను ప్రేక్షకులు అంగీకరిస్తారా? హాలీవుడ్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బాండ్ గర్ల్స్‌గా అకికో వాకబయాషి, గ్లోరియా ఎండ్రీ, గ్రేస్ జోన్స్, మిచెల్లీ యెయో లాంటి వివిధ జాతులకు చెందిన మహిళలను తీసుకున్నప్పుడు బాండ్ హీరోగా ఓ నీగ్రో ఎందుకు తీసుకోకూడదన్నదే ప్రశ్న. -
పక్కా పాన్ మసాలా మోసం
పియర్స్ బ్రోస్నన్. మీరు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులైతే ఈయనను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఒకవేళ కాకపోయినా, పాన్ బహర్ అన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ఒక చిన్న మౌత్‌ఫ్రెష్‌నర్ డబ్బాను చేతిలో పట్టుకొని, ఏదొక పేపర్లో, ఏదొక రోజు కనిపించే ఉంటాడు. పాపం ఆయన అది నిజంగానే ‘కేవలం’ మౌత్‌ఫ్రెష్‌నర్ అనుకొని ప్రమోట్ చేశాడు. అయితే పాన్ బహర్ బిజినెస్ అంతా గుట్కాలని ఆయనకు తెలీదు. పాన్ బహర్‌ను చూడగానే ప్రపంచానికి పాన్, గుట్కాలు తప్ప ఇంకేం గుర్తుకురాదని కూడా ఆయనకు తెలీదు. మొత్తానికి చక్కగా ఇరుక్కున్నాడు. చివరకు అశోక్ అండ్ కో కంపెనీ తనను మోసం చేసిందని విన్నవించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో పొగాకు సంబంధిత పదార్థాలు ఏవీ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. బ్రోస్నన్ ఇలా పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయన మన ప్రభుత్వానికి తన బాధను తన లాయర్ల ద్వారా తెలియపర్చుకోవాల్సి వచ్చింది. కేవలం మౌత్ ఫ్రెష్నర్ అన్న పేరుతోనే ప్రమోట్ చేశానని, తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బ్రోస్నన్. నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించి బాండ్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించుకున్న బ్రోస్నన్ పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినప్పుడు ఆయనపై ఇండియన్ సినిమా అభిమానులంతా రకరకాలుగా జోక్స్ చేసుకున్నారు. -
మోసానికి గురైన జేమ్స్ బాండ్ నటుడు
న్యూఢిల్లీ : పాన్ బహార్ ప్రకటనలో మెరిసిన, హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు పీర్స్ బ్రోస్నన్ ఆ కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. పాన్ మసాలా బ్రాండు తనను మోసం చేసిందని ఆరోపించాడు. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టి పాన్ మసాల బ్రాండు ఈ మోసానికి పాల్పడిందన్నాడు. ఢిల్లీ స్టేట్ టుబాకో కంట్రోల్ సెల్‌కు రాసిన లేఖలో.. ‘కంపెనీ నన్ను మోసం చేసింది. ఉత్పత్తి హానికరమైన స్వభావాన్ని వెల్లడించలేదు. అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను బహిర్గతం చేయలేదు’ అని పేర్కొన్నట్టు అదనపు డైరెక్టర్(హెల్త్) ఎస్కే అరోరా చెప్పారు. ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం బ్రోస్నన్కు షోకాజు నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈ లీగల్ నోటీసుకు స్పందించిన బ్రోస్నన్, కంపెనీతో తనకున్న ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని, డిపార్ట్మెంట్కు అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని బ్రోస్నన్ తెలిపారు. భవిష్యత్తులో హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రోస్నన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్టు అరోరా పేర్కొన్నారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాకు అధికారులు ఆదేశించారు. సామాజిక బాధ్యతను సెలబ్రిటీలు తప్పక తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత వారిని సెలబ్రిటీలను దేవుడిలా భావించి, గుడ్డిగా అనుకరించకూడదని సూచించారు. సిగరెట్స్, ఇతర టుబాకో ప్రొడక్ట్‌ల యాక్ట్ 2003 కింద టుబాకో ఉత్పత్తుల అన్ని ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. -
వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
న్యూఢిల్లీ : వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లతో అలరించిన వరల్డ్ సూపర్ స్టార్, హాలీవుడ్ యాక్టర్ పియర్స్ బ్రాస్నస్, పాన్ బహార్ పాన్ మసాలా యాడ్‌పై తన ఫోటో ఉండటంపై షాక్‌కు గురయ్యారు. మోసపూరితంగా, అనధికారికంగా తన ఇమేజ్ను పాన్ బహార్ వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తాను అసలు అంగీకరించనని బ్రాస్నన్ ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్స్ తయారుచేసే పాన్ బహారాతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మెరిసే పళ్లు, తాజా శ్వాస వంటి ట్యాగ్‌లైన్‌ను ప్రమోట్ చేయడానికే కాంట్రాక్టులో అంగీకరించినట్టు పేర్కొన్నారు. కానీ తన కాంట్రాక్టుకు విరుద్ధంగా అనధికారికంగా తన ఫోటోను అన్నీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య మెరుగుదలకై తోడ్పడేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు స్ఫష్టంచేశారు. ఈ సందర్భంగా తన మొదటి భార్య, కూతురు, పలువురు స్నేహితులు క్యాన్సర్‌తో చనిపోయిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌ను సపోర్టు చేయడానికే తాను కట్టుబడిఉన్నట్టు వెల్లడించారు. తనకు తెలియకుండానే జరిగిపోయిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్‌ను తాను ఎండోర్స్ చేసుకున్నట్టు మీడియా అవుట్‌లెట్స్‌ను కూడా నమ్మిస్తూ పాన్ బహారా మోసం చేస్తుందన్నారు. ఒకప్పుడు వరల్డ్ సూపర్ స్టార్.. భారతీయ వీధి చివరి దుకాణాల్లో వేలాడే పాన్ మసాలా ప్యాకెట్లో దర్శనమివ్వడంపై పలువురు జోక్స్ వేసిన సంగతి తెలిసిందే. చేతిలో పాన్ మసాలా డబ్బాతో ఆయన ఈ ఫోటోలో కనిపిస్తారు.. -
పాన్ మసాలా ప్రమోషన్‌కు జేమ్స్‌బాండ్
సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి అక్కడి లోకల్ స్టార్స్‌ను తీసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్‌ని ట్రై చేస్తారు. కానీ ఇండియాకు చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ వారు మాత్రం ఏకంగా తమ బ్రాండ్ ప్రమోషన్‌కు హాలీవుడ్ స్టార్ హీరోనే దించేశారు. అది కూడా జేమ్స్‌బాండ్ సీరిస్తో అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పీర్స్ బ్రోస్నన్తో ఇండియన్ పాన్ మసాలాను ప్రమోట్ చేయిస్తున్నారు. శుక్రవారం ఉదయం అన్ని జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు ఓ యాడ్ కూడా ప్రముఖంగా ఆకర్షించింది. వరుస బాండ్ చిత్రాలతో అలరించిన మాజీ జేమ్స్‌బాండ్ పీర్స్ బ్రోస్నన్ చేతిలో ఇండియాలో తయారైన పాన్ మసాలా డబ్బా ఉన్న ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించారు. బాండ్ ప్రచారం పాన్ మసాలాకు ఇంటర్నేషనల్ ఫేం తీసుకు వస్తుందేమో చూడాలి. -
తుషార్‌కు జాక్‌పాట్!
బాలీవుడ్ మాజీ హీరో జితేంద్ర కొడుకు తుషార్ కపూర్‌కు జాక్‌పాట్ తగిలినట్టు హాలీవుడ్ భోగట్టా. బాలీవుడ్లో కొన్నేళ్లుగా తంటాలు పడుతున్నా, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని తుషార్‌కు మాజీ జేమ్స్‌బాండ్ స్టార్ పీర్స్ బ్రోస్నన్, కేట్ హడ్సన్లతో నటించే అవకాశం దొరికిందట. ఆటవిడుపుగా అమెరికా వెళ్లిన తుషార్‌కు అనుకోకుండా ఈ అవకాశం దక్కినట్టు అతడి సన్నిహితుడొకరు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం.. పీర్స్ బ్రోస్నన్ కొడుకు సీన్ బోస్నన్.