Pan Bahar
-
పక్కా పాన్ మసాలా మోసం
పియర్స్ బ్రోస్నన్. మీరు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులైతే ఈయనను తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. ఒకవేళ కాకపోయినా, పాన్ బహర్ అన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ఒక చిన్న మౌత్‌ఫ్రెష్‌నర్ డబ్బాను చేతిలో పట్టుకొని, ఏదొక పేపర్లో, ఏదొక రోజు కనిపించే ఉంటాడు. పాపం ఆయన అది నిజంగానే ‘కేవలం’ మౌత్‌ఫ్రెష్‌నర్ అనుకొని ప్రమోట్ చేశాడు. అయితే పాన్ బహర్ బిజినెస్ అంతా గుట్కాలని ఆయనకు తెలీదు. పాన్ బహర్‌ను చూడగానే ప్రపంచానికి పాన్, గుట్కాలు తప్ప ఇంకేం గుర్తుకురాదని కూడా ఆయనకు తెలీదు. మొత్తానికి చక్కగా ఇరుక్కున్నాడు. చివరకు అశోక్ అండ్ కో కంపెనీ తనను మోసం చేసిందని విన్నవించుకోవాల్సి వచ్చింది. భారత్‌లో పొగాకు సంబంధిత పదార్థాలు ఏవీ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. బ్రోస్నన్ ఇలా పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినందుకు ఆయన మన ప్రభుత్వానికి తన బాధను తన లాయర్ల ద్వారా తెలియపర్చుకోవాల్సి వచ్చింది. కేవలం మౌత్ ఫ్రెష్నర్ అన్న పేరుతోనే ప్రమోట్ చేశానని, తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు బ్రోస్నన్. నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లో నటించి బాండ్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించుకున్న బ్రోస్నన్ పాన్ బహర్‌ను ప్రమోట్ చేసినప్పుడు ఆయనపై ఇండియన్ సినిమా అభిమానులంతా రకరకాలుగా జోక్స్ చేసుకున్నారు. -
బాండ్ యాడ్‌పై పాన్ బహార్ క్లారిటీ
మాజీ జేమ్స్ బాంబ్ పీర్స్ బ్రోస్నన్ చేసిన పాన్ బహార్ యాడ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ పాన్ కంపెనీ ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవటంతో ఆ యాడ్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. అదే సమయంలో పొగాకు ఉత్పత్తులను జేమ్స్ బాండ్ ప్రమోట్ చేయటంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన బాండ్ నటుడు బ్రోస్నన్ వివరణ ఇచ్చుకున్నాడు. అది హానికరమైనదని తనకు తెలియదని, తాను అది కేవలం టూత్ వైట్నర్ అన్న ఉద్దేశంతోనే ప్రమోట్ చేసేందుకు అంగీకరించానని తెలిపాడు. కంపెనీ అనుమతి తీసుకోకుండా తన ఫొటోను పొగాకు ఉత్పత్తులకు అనధికారింగా వినియోగించిందని తెలిపాడు. ఈ ప్రకటనతో నొచ్చుకున్న అభిమానులను క్షమాపణలు కూడా కోరాడు. అయితే ఈ వివాదం పై తాజాగా పాన్ బహార్ కంపెనీ స్పందించింది. బాండ్‌తో చిత్రీకరించిన యాడ్ కాంట్రాక్ట్ ప్రకారమే చేశామని, అన్ని విషయాలు బ్రోస్నన్కు వివరించిన తరువాతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు పాన్ బహార్ కంపెనీ యజమాని దినేష్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ప్రాడక్ట్ తయారీలో పొగాకు వినియోగించలేదని, ఇది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే అని తెలిపాడు. అంతేకాదు తమతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్న బ్రోస్నన్ పై చట్టం పరంగా చర్యలు తీసుకునే విషయంపై కూడా చర్చిస్తున్నామని తెలిపారు. -
వాటిపై తన ఫోటో చూసి జేమ్స్ బాండ్ యాక్టర్ షాక్
న్యూఢిల్లీ : వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లతో అలరించిన వరల్డ్ సూపర్ స్టార్, హాలీవుడ్ యాక్టర్ పియర్స్ బ్రాస్నస్, పాన్ బహార్ పాన్ మసాలా యాడ్‌పై తన ఫోటో ఉండటంపై షాక్‌కు గురయ్యారు. మోసపూరితంగా, అనధికారికంగా తన ఇమేజ్ను పాన్ బహార్ వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తాను అసలు అంగీకరించనని బ్రాస్నన్ ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ మసాలా బ్రాండ్స్ తయారుచేసే పాన్ బహారాతో తాను అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మెరిసే పళ్లు, తాజా శ్వాస వంటి ట్యాగ్‌లైన్‌ను ప్రమోట్ చేయడానికే కాంట్రాక్టులో అంగీకరించినట్టు పేర్కొన్నారు. కానీ తన కాంట్రాక్టుకు విరుద్ధంగా అనధికారికంగా తన ఫోటోను అన్నీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుతుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్య మెరుగుదలకై తోడ్పడేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు స్ఫష్టంచేశారు. ఈ సందర్భంగా తన మొదటి భార్య, కూతురు, పలువురు స్నేహితులు క్యాన్సర్‌తో చనిపోయిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. మహిళల ఆరోగ్యంపై, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌ను సపోర్టు చేయడానికే తాను కట్టుబడిఉన్నట్టు వెల్లడించారు. తనకు తెలియకుండానే జరిగిపోయిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్టు పేర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్స్‌ను తాను ఎండోర్స్ చేసుకున్నట్టు మీడియా అవుట్‌లెట్స్‌ను కూడా నమ్మిస్తూ పాన్ బహారా మోసం చేస్తుందన్నారు. ఒకప్పుడు వరల్డ్ సూపర్ స్టార్.. భారతీయ వీధి చివరి దుకాణాల్లో వేలాడే పాన్ మసాలా ప్యాకెట్లో దర్శనమివ్వడంపై పలువురు జోక్స్ వేసిన సంగతి తెలిసిందే. చేతిలో పాన్ మసాలా డబ్బాతో ఆయన ఈ ఫోటోలో కనిపిస్తారు..