రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్‌ రుణాలు | Patanjali Secures Rs 3200 Crore Loan From Banks To Buy Ruchi Soya | Sakshi
Sakshi News home page

రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్‌ రుణాలు

Published Sat, Nov 30 2019 5:17 AM | Last Updated on Sat, Nov 30 2019 5:17 AM

Patanjali Secures Rs 3200 Crore Loan From Banks To Buy Ruchi Soya - Sakshi

న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద కంపెనీ... రుచి సోయా కంపెనీని కొనుగోలు చేయడానికి బ్యాంక్‌ల నుంచి రూ.3,200 కోట్ల రుణాన్ని పొందింది. ఈ మేరకు ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియంతో ఒప్పందం కుదిరిందని పతంజలి ఆయుర్వేద ఎమ్‌డీ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. ఇందులో ఎస్‌బీఐ వాటా రూ.1,200కోట్లు.  బకాయిల చెల్లింపుల్లో విఫలం కావడంతో రుచి సోయాపై 2017 డిసెంబర్‌లో దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. పతంజలి ఆయుర్వేద కంపెనీ సమరి్పంచిన రిజల్యూషన్‌ ప్లాన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement