Viral Video: Ramdev Baba Sensational Comments About His Arrest In Zoom Call - Sakshi
Sakshi News home page

మీ నాన్న వల్ల కూడా కాదు: రాందేవ్‌ బాబా వ్యాఖ్యలు

Published Thu, May 27 2021 11:44 AM | Last Updated on Thu, May 27 2021 2:38 PM

Their Father Cannot Arrest To Me Says Swami Ramdev Baba - Sakshi

జూమ్‌ సమావేశంలో మాట్లాడుతున్న రాందేవ్‌ బాబా

న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై వైద్యులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఉత్తరాఖండ్‌ విభాగం రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాందేవ్‌ బాబాకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘నన్ను అరెస్ట్‌ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అని వ్యాఖ్యానించాడు. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యల అనంతరం రాందేవ్‌ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది. జూమ్‌ సమావేశంలో పైవిధంగా మాట్లాడారు. దుండగుడు రాందేవ్‌, మహాదొంగ రాందేవ్‌ వంటి పదాలు తనపై వస్తున్నాయని చెబుతూ నవ్వుకున్నారు. అయితే ‘నీ తండ్రి కూడా అరెస్ట్‌ చేయడు’ ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement