చిందేసిన బాబా రాందేవ్ | When Baba Ramdev shook a leg on the stage of reality show Super Dancer | Sakshi
Sakshi News home page

చిందేసిన బాబా రాందేవ్

Published Thu, Oct 20 2016 8:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

చిందేసిన బాబా రాందేవ్

చిందేసిన బాబా రాందేవ్

ముంబై: యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి డాన్సర్ అవతారం ఎత్తారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా చిందేశారు. చిన్నపిల్లల నృత్యకార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన ఆయన డాన్స్ చేయడం విశేషం. సూపర్ డాన్సర్ రియాలిటీ షో ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరణలో ఇటీవల ఆయన పాల్గొన్నారు. స్పెషల్ గెస్టుగా హాజరైన రాందేవ్ చిన్నారుల నృత్యాలకు ముగ్ధులయ్యారు. అక్కడితో ఆగకుండా వారితో తాను కూడా పాదం కలిపారు. పిల్లలను ప్రోత్సహిస్తూ వాళ్లతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు.

ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్న హీరోయిన్ శిల్పాశెట్టి, దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ కూడా రాందేవ్ తో కలిసి నృత్యాలు చేయడంతో సెట్ అంతా సందడిగా మారిపోయింది. అయితే రాందేవ్ కు ఆటపాటలు కొత్తకాదు. గతంలో పలు సందర్భాల్లో ఆటపాటలతో ఆయన అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement