సాక్షి, న్యూఢిల్లీ: గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2018 పై ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ స్పందించారు. సామన్యులకు ఆదాయ పన్ను మినహాయింపు లేకపోవడంపై ఆయన నిరాశను వ్యక్తం చేశారు. ఈ పరిమితిని రూ. 5లక్షలకు పెంచితే బావుండేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సగటు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాల్సిందని పేర్కొన్నారు. ముఖ్యంగా దీని వల్ల రాబోయే ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితం ఉండేదని చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం కచ్చితంగా తీసుకుంటుందనే ధీమాను బాబా రాందేవ్ వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇది జాతి నిర్మాణ బడ్జెట్ అంటూ ప్రశంసించారు.
ఆదాయం పన్నురేట్లు , స్లాబ్లలో ఎలాంటిమార్పులు చేయకుండా యధాతథంగా ఉంచటంతో పాటు, ఉద్యోగులు, పెన్షనర్ల కు స్టాండర్డ్ డిడక్షన్(రవాణా, మెడికల్ ఖర్చులు ) సౌలభ్యాన్ని రూ. 40వేలకు కల్పించారు. అలాగే సీనియర్ పౌరులకు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, ఆరోగ్య భీమా ప్రీమియం , క్లిష్టమైన అనారోగ్యం ఖర్చు నుంచి రూ.50వేల మినహాయింపును ఈ బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment