
రాందేవ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్
రోహ్‌తక్: ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయడానికి వ్యతిరేకించే వారి తలలు నరికేయాలని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌పై నాన్‌బెయిలబుల్ వారెం ట్ జారీ అయింది. స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరీశ్ గోయల్ ఈ వారెంట్ జారీచేస్తూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేశారు.
మే 12న కోర్టు రాందేవ్‌పై బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. సమన్లు, బెయిలబుల్ వారెంట్ జారీచేసినా బుధవారం కోర్టులో హాజరవడంలో రాందేవ్ విఫలమైనందుకే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని లాయర్ ఓపీ చుగ్ అన్నారు.