అహ్మదాబాద్ : అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతికి గర్వకారణమని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. రాముడు కేవలం హిందువులకే కాకుండా ముస్లింలకూ పూర్వీకుడని చెప్పుకొచ్చారు. ఖేడా జిల్లా నదియాద్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామ మందిర అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు.
రామ మందిరాన్ని అయోధ్యలోనే నిర్మించాలన్నది తన అభిమతమని, రామ మందిరం అయోధ్యలో కాకుండా మక్కా, మదీనా లేదా వాటికన్ నగరంలో నిర్మించలేరని వ్యాఖ్యానించారు. రాముడి జన్మస్ధలం అయోధ్య అనేది వాస్తవమని, రాముడు మనందరికీ పూర్వీకుడని పేర్కొన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కాగా రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పాలక బీజేపీతో లబ్ధి పొందిన ఇలాంటి బాబాలు ఎన్నికల సమయంలో బీజేపీ, మోదీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ముందుకొస్తున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment