న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్ నూడుల్స్‌కి అనుమతుల వివాదాన్ని పతంజలి ఆయుర్వేద సామరస్యంగా పరిష్కరించుకుంటుందని సంస్థను ప్రమోట్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. తమకి ఇచ్చిన అమ్మకం లెసైన్సు, తయారీ లెసైన్సును తీసుకుని సంస్థ ప్రతినిధులు ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులను కలుస్తారని ఆయన వివరించారు. సమన్వయ లోపం వల్లే ఈ వివాదం తలెత్తి ఉండొచ్చని, ఇది సామరస్యంగా పరిష్కారం కాగలదని బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మాకు అనుమతులు ఉన్నాయి.
అలాగే, కాంట్రాక్టు ప్రాతిపదికన నూడుల్స్‌ను మాకోసం తయారు చేస్తున్న సంస్థలకు కూడా అనుమతులు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఈ వివాదంపై స్పందించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నిరాకరించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఇటీవల ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంస్థకు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తయారు చేసే అనుమతులు లేవంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చైర్‌పర్సన్ ఆశీష్ బహుగుణ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దీన్ని పతంజలి ఆయుర్వేద సంస్థ ఖండించింది.
నూడుల్స్ వివాదం పరిష్కరించుకుంటాం
Published Fri, Nov 20 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement