Baba Amte
-
బాబా ఆమ్టే సామాజిక ఉద్యమకారుడు
సామాజిక న్యాయంతో స్థిరంగా కొనసాగే సమాజాన్ని స్వప్నించిన ఈ దార్శనికుడికి ప్రకృతి పైన, సమానత్వం పైన ఎనలేని విశ్వాసం. ప్రతి మనిషీ.. అతడు వికలాంగుడైనా, కుష్టురోగి అయినా వారికి ఒక శక్తినిచ్చే వనరుగా కనిపిస్తారు బాబా ఆమ్టే. ‘‘ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఉదాత్తతను వర్షించే వారే యువత’’ అన్నది బాబా నిర్వచనం. ఆ లక్షణమే ఆయనను వికసిస్తున్న నవతరంతో సాధ్యమైనంత అనుబంధాన్ని పెంచుకోగలిగేలా చేసింది. సోమనాథ్ క్యాంప్‌లో చంద్రాపూర్ వద్ద కుష్టు రోగుల కోసం ఆయన ఏర్పాటు చేసిన ఆనందవన్ ఆశ్రమం యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆయన నెలకొల్పిన హేమల్ కాసా అనే ఆదివాసీల కేంద్రం చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలుగా రూపాంతరం చెందుతాయనడానికి చక్కని నిదర్శనం. మురళీధర్ దేవదాస్ ఆమ్టే వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన మహాత్మాగాంధీ, వినోబా భావేల సిద్ధాంతాలతో పాటు మానవతావాదాన్ని స్థిరంగా విశ్వసించారు. అంతకుమించి ఆయన ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టగల విశిష్ట సామర్థ్యం గల వ్యక్తి. కేవలం మాటలకు పరిమితం కాని ఆచరణ పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసానికి ప్రతిరూపమే ఆయన ఉద్యమం. పంజాబ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు; ముంబైలో, భాగల్పూర్లో అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. బాధితుల తరఫున పోరాటం సాగించారు. భారత్ జోడో అంటూ ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది హృదయాలను కదిలించింది. మానవ జాతిని ముక్కలు చేసే దురాలోచనలను ఎదుర్కొనేందుకు ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిజాయితీగా పిలుపునివ్వడమే అందుకు కారణం. ఆయన వైయక్తిక విషయాల పట్ల కూడా శ్రద్ధ చూపేవారు. తన భార్యను ప్రేమించడమే కాదు, గౌరవించారు. ఆయన కుమారులు వికాస్, ప్రకాష్, కూతుళ్లు, మనవలు అందరూ ఆయన ధార్మిక కృషిలో భాగస్థులైన వారే. (చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 మహిళాశక్తి) -
బాబా ఆమ్టే మనవరాలు అనూహ్య మరణం
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, బాబా అమ్టే మనవరాలు, డాక్టర్ వికాస్ అమ్టే కుమార్తె షీతల్ ఆమ్టే కరాజ్గి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఆనంద్‌వన్‌లో చంద్రపూర్ జిల్లాలోని తన నివాసంలోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్యహత్యకు పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న షీతల్ పాయిజన్ ఇంజక్షన్ ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే మహారోగి సేవా సమితి (ఎంఎస్ఎస్) లో జరిగిన అవకతవకలపై ఫేస్బుక్ లో ఆరోపణలు చేసిన తరువాత ఆమె చనిపోవడం పలు అనుమానాలను తావిస్తోంది. స్వచ్ఛంద సంస్థ మహారోగి సేవా సమితి (ఎంఎస్ఎస్) సీఈవో, బోర్డు సభ్యురాలు షీతల్ వైద్యనిపుణురాలు. డిజేబిలిటీ స్పెషలిస్ట్ కూడా. ప్రధానంగా కుష్టు వ్యాధి, అంగవైకల్యం పొందిన బాధితులకు సహాయం చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో ఆమె కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. మరోవైపు గతవారం ఎంఎస్‌ఎస్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫేస్బుక్లో తన గళాన్ని వినిపించారు. కానీ రెండు గంటల్లో దాన్ని తొలగించారు. ఈ సందర్బంగా ఆమె ఆమ్టే కుటుంబంతోపాటు, ఇతరులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే ఈ రోజు ఉదయం ‘యుద్ధమూ శాంతి’ గురించి ప్రస్తావిస్తూ తన ఆక్రిలిక్ పెయింటింగ్‌ను ట్వీట్ చేశారు. అనంతరం కొన్ని గంటలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విషాదాన్ని నిపింది. అయితే సోషల్ మీడియాల్ షీతల్ తమపై చేసిన ఆరోపణలను ఆమ్టే కుటుంబం ఖండించింది. నవంబరు 24న జారీ చేసిన ప్రకటనలో ఆమె తల్లిదండ్రులు డాక్టర్ వికాస్, డాక్టర్ భారతితో పాటు డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే ఈ మేరకు సంతకాలు చేశారు. వికాస్, ప్రకాష్ ఇద్దరూ బాబా ఆమ్టే కుమారులు. షీతల్ : కొన్ని వివరాలు నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి షీటల్ డిగ్రీ పూర్తి చేసిన షీతల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్‌గా షీతల్ ఎదిగారు.ఎంబిబిఎస్ డిగ్రీతో పాటు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. డాక్టర్ విద్య పూర్తి చేసిన తరువాత ఆమె ఆనంద్‌వన్‌లో సేవ చేయాలని నిర్ణయించుకుని వికరాంగులైనకుష్టురోగులు, వికలాంగులు, దృష్టి వినికిడి లోపం ,ఆదిమ గిరిజనులకు ఎనలేని సేవ చేశారు. ఈ క్రమంలో డిజేబిటిటీ స్పెషలిస్టుగా ఖ్యాతి గడించారు. ముఖ్యంగా ఆనంద్‌వన్‌లో సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడంలో, స్మార్ట్ విలేజ్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాగే ఆమె చేసిన సేవకు గాను ఆమెను వరల్డ్ ఎకనామిక్ ఫోరం 'యంగ్ గ్లోబల్ లీడర్ 2016' గా ఎంపిక చేసింది, తరువాత ప్రపంచ ఆర్థిక ఫోరం నిపుణుల నెట్వర్క్ సభ్యునిగా ఎంపికయ్యారు. వరల్డ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్‌కు కూడా ఆమె సేవలందిస్తున్నారు.. అలాగే 2016లో ఇంక్ ఫెలోషిప్ రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఘనత షీతల్ సొంతం. 'War and Peace'#acrylic on canvas. 30 inches x 30 inches. pic.twitter.com/yxfFhuv89z — Dr. Sheetal Amte-Karajgi (@AmteSheetal) November 30, 2020 -
నూడుల్స్ వివాదం పరిష్కరించుకుంటాం
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ నూడుల్స్‌కి అనుమతుల వివాదాన్ని పతంజలి ఆయుర్వేద సామరస్యంగా పరిష్కరించుకుంటుందని సంస్థను ప్రమోట్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. తమకి ఇచ్చిన అమ్మకం లెసైన్సు, తయారీ లెసైన్సును తీసుకుని సంస్థ ప్రతినిధులు ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులను కలుస్తారని ఆయన వివరించారు. సమన్వయ లోపం వల్లే ఈ వివాదం తలెత్తి ఉండొచ్చని, ఇది సామరస్యంగా పరిష్కారం కాగలదని బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మాకు అనుమతులు ఉన్నాయి. అలాగే, కాంట్రాక్టు ప్రాతిపదికన నూడుల్స్‌ను మాకోసం తయారు చేస్తున్న సంస్థలకు కూడా అనుమతులు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఈ వివాదంపై స్పందించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ నిరాకరించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఇటీవల ఇన్స్టంట్ నూడుల్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంస్థకు ఇన్స్టంట్ నూడుల్స్‌ను తయారు చేసే అనుమతులు లేవంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ ఆశీష్ బహుగుణ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దీన్ని పతంజలి ఆయుర్వేద సంస్థ ఖండించింది. -
స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా...
దాదాపు 13 ఏళ్ల తర్వాత నానా పటేకర్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 1991లో ‘ప్రహార్: ది ఫైనల్ ఎటాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత నానా పటేకర్ మళ్లీ దర్శకత్వం చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు మళ్లీ డెరైక్షన్ చేయాలనిపించింది. సంఘ సేవకుడు స్వర్గీయ బాబా ఆమ్టే జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం చేయనున్నారు. హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం బాబా, ఆయన తనయుడు డా.ప్రకాశ్ పాత్రల చుట్టూ ప్రధానంగా తిరుగుతుంది. ఈ రెండు పాత్రలనూ నానా పటేకరే పోషించనున్నారు. కాగా, ఇటీవల విడుదలైన మరాఠీ చిత్రం ‘డా. ప్రకాశ్ బాబా ఆమ్టే: ది రియల్ హీరో’లో ప్రకాశ్ పాత్రను నానా పటేకర్ చేశారు. గత నెల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ చిత్రంలో కూడా నానా పటేకర్‌ను బాబా ఆమ్టే పాత్ర చేయమన్నారు. దాని గురించి నానా పటేకర్ చెబుతూ -‘‘బాబా జీవితం ఆధారంగా సినిమా చేయడానికి గత కొంత కాలంగా పరిశోధనలు జరుపుతున్నాను. నేను దర్శకత్వం వహించే చిత్రంలోనే ఆ పాత్ర చేయాలనుకున్నాను. అందుకే అంగీకరించలేదు. బాబా ఆమ్టే రెజ్లర్ కాబట్టి, చాలా దృఢంగా ఉండేవారు. అందుకని, నా శరీరాకృతిని మార్చుకోవడానికి గత కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నా’’ అని చెప్పారు. నానాకి ఇప్పుడు 63 ఏళ్లు. ఈ వయసులో కండలు పెంచడం, శరీరాకృతిని మార్చుకోవడమంటే చిన్న విషయం కాదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి నానా పటేకర్ ఎంత పట్టుదలగా ఉంటారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.