సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, బాబా అమ్టే మనవరాలు, డాక్టర్ వికాస్ అమ్టే కుమార్తె షీతల్ ఆమ్టే కరాజ్గి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఆనంద్‌వన్‌లో చంద్రపూర్ జిల్లాలోని తన నివాసంలోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్యహత్యకు పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న షీతల్ పాయిజన్ ఇంజక్షన్ ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే మహారోగి సేవా సమితి (ఎంఎస్‌ఎస్) లో జరిగిన అవకతవకలపై ఫేస్‌బుక్ లో ఆరోపణలు చేసిన తరువాత ఆమె చనిపోవడం పలు అనుమానాలను తావిస్తోంది.
స్వచ్ఛంద సంస్థ మహారోగి సేవా సమితి (ఎంఎస్‌ఎస్) సీఈవో, బోర్డు సభ్యురాలు షీతల్ వైద్యనిపుణురాలు. డిజేబిలిటీ స్పెషలిస్ట్ కూడా. ప్రధానంగా కుష్టు వ్యాధి, అంగవైకల్యం పొందిన బాధితులకు సహాయం చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో ఆమె కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. మరోవైపు గతవారం ఎంఎస్‌ఎస్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫేస్‌బుక్‌లో తన గళాన్ని వినిపించారు. కానీ రెండు గంటల్లో దాన్ని తొలగించారు. ఈ సందర్బంగా ఆమె ఆమ్టే కుటుంబంతోపాటు, ఇతరులపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అలాగే ఈ రోజు ఉదయం ‘యుద్ధమూ శాంతి’ గురించి ప్రస్తావిస్తూ తన ఆక్రిలిక్ పెయింటింగ్‌ను ట్వీట్ చేశారు. అనంతరం కొన్ని గంటలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విషాదాన్ని నిపింది. అయితే సోషల్ మీడియాల్ షీతల్ తమపై చేసిన ఆరోపణలను ఆమ్టే కుటుంబం ఖండించింది. నవంబరు 24న జారీ చేసిన ప్రకటనలో ఆమె తల్లిదండ్రులు డాక్టర్ వికాస్, డాక్టర్ భారతితో పాటు డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే ఈ మేరకు సంతకాలు చేశారు. వికాస్, ప్రకాష్ ఇద్దరూ బాబా ఆమ్టే కుమారులు.
షీతల్ : కొన్ని వివరాలు
నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి షీటల్ డిగ్రీ పూర్తి చేసిన షీతల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్‌గా షీతల్ ఎదిగారు.ఎంబిబిఎస్ డిగ్రీతో పాటు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. డాక్టర్ విద్య పూర్తి చేసిన తరువాత ఆమె ఆనంద్‌వన్‌లో సేవ చేయాలని నిర్ణయించుకుని వికరాంగులైనకుష్టురోగులు, వికలాంగులు, దృష్టి వినికిడి లోపం ,ఆదిమ గిరిజనులకు ఎనలేని సేవ చేశారు. ఈ క్రమంలో డిజేబిటిటీ స్పెషలిస్టుగా ఖ్యాతి గడించారు. ముఖ్యంగా ఆనంద్‌వన్‌లో సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడంలో, స్మార్ట్ విలేజ్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాగే ఆమె చేసిన సేవకు గాను ఆమెను వరల్డ్ ఎకనామిక్ ఫోరం 'యంగ్ గ్లోబల్ లీడర్ 2016' గా ఎంపిక చేసింది, తరువాత ప్రపంచ ఆర్థిక ఫోరం నిపుణుల నెట్‌వర్క్ సభ్యునిగా ఎంపికయ్యారు. వరల్డ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్‌కు కూడా ఆమె సేవలందిస్తున్నారు.. అలాగే 2016లో ఇంక్ ఫెలోషిప్ రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఘనత షీతల్ సొంతం.
'War and Peace'#acrylic on canvas.
— Dr. Sheetal Amte-Karajgi (@AmteSheetal) November 30, 2020
30 inches x 30 inches. pic.twitter.com/yxfFhuv89z
Comments
Please login to add a commentAdd a comment