స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా... | Nana Patekar making biopic on social worker Baba Amte | Sakshi
Sakshi News home page

స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా...

Published Wed, Nov 26 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా...

స్వీయ దర్శకత్వంలో వెండితెరపై బాబా ఆమ్టేగా...

దాదాపు 13 ఏళ్ల తర్వాత నానా పటేకర్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. విలక్షణ నటునిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 1991లో ‘ప్రహార్: ది ఫైనల్ ఎటాక్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత నానా పటేకర్ మళ్లీ దర్శకత్వం చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు మళ్లీ డెరైక్షన్ చేయాలనిపించింది. సంఘ సేవకుడు స్వర్గీయ బాబా ఆమ్టే జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం చేయనున్నారు. హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం బాబా, ఆయన తనయుడు డా.ప్రకాశ్ పాత్రల చుట్టూ ప్రధానంగా తిరుగుతుంది.
 
 ఈ రెండు పాత్రలనూ నానా పటేకరే పోషించనున్నారు. కాగా, ఇటీవల విడుదలైన మరాఠీ చిత్రం ‘డా. ప్రకాశ్ బాబా ఆమ్టే: ది రియల్ హీరో’లో ప్రకాశ్ పాత్రను నానా పటేకర్ చేశారు. గత నెల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ చిత్రంలో కూడా నానా పటేకర్‌ను బాబా ఆమ్టే పాత్ర చేయమన్నారు. దాని గురించి నానా పటేకర్ చెబుతూ -‘‘బాబా జీవితం ఆధారంగా సినిమా చేయడానికి గత కొంత కాలంగా పరిశోధనలు జరుపుతున్నాను. నేను దర్శకత్వం వహించే చిత్రంలోనే ఆ పాత్ర చేయాలనుకున్నాను.
 
 అందుకే అంగీకరించలేదు. బాబా ఆమ్టే రెజ్లర్ కాబట్టి, చాలా దృఢంగా ఉండేవారు. అందుకని, నా శరీరాకృతిని మార్చుకోవడానికి గత కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నా’’ అని చెప్పారు. నానాకి ఇప్పుడు 63 ఏళ్లు. ఈ వయసులో కండలు పెంచడం, శరీరాకృతిని మార్చుకోవడమంటే చిన్న విషయం కాదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి నానా పటేకర్ ఎంత పట్టుదలగా ఉంటారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement