మరాఠీ నటుడు, నిర్మాత, మాజీ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారి నానా పటేకర్ చలనచిత్ర రంగంలో అత్యంత విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కుర్రాళ్ల మాదిరిగా చలాకీగా కనిపిస్తారు. ఆ ఫిట్‌నెస్ మంత్ర ఏంటో ఇన్‌స్టా థియోబ్లిక్స్‌లో షేర్ చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు ఎలాంటి వ్యాయమాలు చేస్తారో కూడా చెప్పారు. అవేంటంటే..
నానా పటేకర్ తన ఫిట్‌నెస్ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అన్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్‌గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి నలుగురిని పడగొట్టగలనని ధీమాగా చెప్పారు. ఫిట్‌నెస్ కంటే ముఖ్యం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం వంటివి చేయాలని చెప్పారు.
ఈ దృక్పథమే మనల్ని ఆయురారోగ్యాలతో ఉండేలా చేస్తుందన్నారు. అద్దం ముందు నుంచొని రకరకాల ఫోజులిచ్చే అలవాటుని ఇప్పటికీ మానుకోలేదని అన్నారు. దీనివల్ల తాను చాలా బాగున్నాను అనే నమ్మకం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లో బెంచ్ ప్రెస్‌లు, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్‌లు చేయడమం మంచిదన్నారు.
ఒకవేళ ఈ వయసులో జిమ్ చేయలేం అనుకుంటే..సింపుల్‌గా సూర్యనమస్కారాలు వేయండి చాలు అంటున్నారు నానా. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నానాపటేకర్ ఇచ్చిన సలహాలు, సూచనలకు మద్దతిచ్చారు హైదరాబాద్‌లోని అపోలా ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్.
మలి వయసులో అవి తప్పనిసరి..
ఆ నటుడు చెప్పినట్లుగా 70 ఏళ్లు పైబడిన వారు ఏరోబిక్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలతో సహా రెగ్యులర్ వ్యాయామాలు చేయాలన్నారు. వారంలో 150 నిమిషాలు సాధారణ వర్కౌట్లు, 75 నిమిషాలు శక్తిమంతమైన వ్యాయామాలు చేసేలా లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహ కూడా అని అన్నారు. పోనీ ఇవి కాకుండా 30 నిమిషాల పాటు నడక, సైక్లింగ్, ఈత వంటివి చెయ్యొచ్చన్నారు. అయితే ఈ ఏజ్ ఎక్కు దూరం జాగింగ్ లేదా పరిగెత్తకపోవడమే మంచిదన్నారు.
శక్తి శిక్షణ కోసం పుష్ అప్స్, స్క్వాట్‌లు, చిన్న మొత్తంలో బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చన్నారు. అలాగే ఈ వయసులో ఎక్కువగా కీళ్లు పట్టేస్తుంటాయి కాబట్టి..యోగాపై దృష్టి పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడే తాడాసనం వంటివి చేయాలన్నారు. ఇదీ వృద్ధాప్యంలోసాధారణంగా వచ్చే వణుకు లేదా పడిపోవటాన్ని నివారిస్తుందన్నారు.
(చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!)
Comments
Please login to add a commentAdd a comment