'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా | Vanvaas Movie Ott Streaming Date Update | Sakshi
Sakshi News home page

Vanvaas OTT: ఎమోషనల్ మూవీ.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Published Sun, Mar 9 2025 12:45 PM | Last Updated on Sun, Mar 9 2025 1:26 PM

Vanvaas Movie Ott Streaming Date Update

కొన్నిసార్లు రాంగ్ టైంలో రిలీజ్ అవుతుండటం వల్ల కొన్నికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. అలా 'పుష్ప 2'(Pushpa 2 Movie) తెగ ఆడేస్తున్నప్పుడు థియేటర్లలో విడుదలైన ఓ హిందీ మూవీ.. దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?

దిగ్గజ నటుడు నానా పాటేకర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'వనవాస్'.(Vanvaas Movie) గదర్, గదర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అనిల్ శర్మ దీనికి దర్శకుడు. మంచి ఫిలాసఫీ, ఎమోషనల్ కంటెంట్ తో తీశారు కానీ పుష్ప 2 ఉత్తరాదిలో మంచి జోష్ లో ఆడేస్తున్నప్పుడు అంటే డిసెంబరు 20న థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో పెద్దగా వసూళ్లు రాలేదు.

(ఇదీ చదవండి: నానా పాటేకర్ పై హీరోయిన్ పెట్టిన మీటూ కేసు కొట్టేసిన హైకోర్ట్)

దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు 'వనవాస్' మూవీ ఓటీటీ (Vanvaas OTT) తేదీ ఖరారు చేసుకుంది. మార్చి 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు.

'వనవాస్' విషయానికొస్తే.. ప్రతాప్ (నానా పాటేకర్)కి మతిమరుపు సమస్య. ఇతడి ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. తండ్రి అడ్డొస్తున్నాడని చెప్పి అతడిని కాశీలో వదిలి వచ్చేస్తారు. అక్కడ ఈయనకు వీర్(ఉత్కర్ష్) పరిచయమవుతాడు. మరి ప్రతాప్ ని వీర్ ఇంటికి చేర్చాడా? చివరకు ఏమైందనదే స్టోరీ?

(ఇదీ చదవండి: రష్మికని హింసించకండి.. నటి రమ్య కౌంటర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement