Instant noodles
-
భారీగా పెరిగిన ఇన్స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి!
థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14ఏళ్ల తర్వాత ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను పెంచే ప్రతిపాదనకు థాయ్‌లాండ్ ఆమోదం తెలిపిందని ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. పెరిగిన ధరలు ఆగస్ట్ 25 (నిన్న)నుంచి అమల్లోకి వచ్చాయి. 2008లో చివరి సారిగా థాయిల్ లాండ్ ప్రభుత్వం ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచింది. అయితే కొద్ది రోజుల క్రితం.. ఉక్రెయిన్‌పై రష్యా వార్, గత సంవత్సరాల్లో సంభవించిన కరువు, వరదలతో పాటు గోధుమలు, ఇంధనం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఇన్ స్టంట్ నూడుల్స్ ఐదు ప్రధాన ఉత్పత్తిదారులు తమ ధరలను పెంచడానికి అనుమతించాలని థాయ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో తాజాగా ఉత్పత్తి దారులు విజ్ఞప్తితో థాయ్ ప్రభుత్వం ధరల పెంపుపై మద్దతు పలికింది. దీంతో ప్రతి సాధారణ పరిమాణ ప్యాకెట్‌పై ఏడు భాట్ల (అంటే భారత్ కరెన్సీలో రూ.15.48) పెంచుతూ వాణిజ్య విభాగం ఆమోదం తెలిపింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను బ్యాంకాక్ ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్‌కి ఆరు భాట్ (రూ.13.27కి) పరిమితం చేసింది. ►ఇటీవలి వారాల్లో, గోధుమ పిండి ధర దాదాపు 20-30 శాతం పెరిగింది. పామాయిల్ ధర రెండింతలు పెరిగిందని థాయ్ ప్రభుత్వ ప్రిజర్వ్డ్ ఫుడ్ విభాగానికి చెందిన వీర నాఫప్రుక్‌చార్ట్ చెప్పారు. ►జూన్‌లో థాయ్‌లాండ్‌లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని, వినియోగదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రించాలంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలలో నూడిల్స్ ధరలు ఇప్పటికే పెరిగాయి. చైనాలో ఈ సంవత్సరం గోధుమ ధర 30 శాతం పెరగవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. -
వేరీ టెస్టీ.. టైం సేఫ్టీ
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): ప్రస్తుతం బిజీ సమయంలో ప్రజలు వేడివేడిగా తమ ఇళ్లల్లోనే ఇన్స్టంట్ మిక్స్ ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో రకరకాల టిఫిన్స్, బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవడానికి గృహిణీలు ఒక రోజు ముందుగానే ఎంతో సమయం వృథా చేసుకునేవారు. ఒక రోజు ముందుగానే ఇడ్లీలు, దోశలు, వడలు తయారు చేసుకోవడానికి పిండిని ముందుగానే రుబ్బి పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వంటకం ఏదైనా సరే మార్క్ట్లో రెడ్‌మిక్స్ పద్ధతిలో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకొని వచ్చిన నిమిషాల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. ఇష్టమైన్ బ్రేక్‌ఫాస్ట్ నిమిషాల్లో రడీగా.. నిత్యం బిజిగా ఉండే ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లే మహిళలకు, విద్యార్థులకు పొద్దుపొద్దునే ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తినడానికి ఇన్స్టంట్ రెడిమిక్స్ ప్యాక్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. బిజిగా ఉండేవారందరూ వీటిపై ఎక్కువ శ్రధ్ద కనబర్చుతున్నారు. ఇడ్లీ,వడ, దోశ, ఉప్మా, వడలను రెడిమిక్స్లతో తయారు చేసి అతిథులకు, కుటుంబీకులకు ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే అందజేస్తున్నారు. ఇంటిల్లిపాదికి సమయం వృథా కాకుండా తక్కువ సమయంలోనే వీటిని అందజేస్తూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. దీంతో పాటు ఓట్స్, నూడుల్స్, పాస్తా, మసాల ఓట్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. దేశంలో పేరొందిన కంపెనీలు వీటిని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ మార్క్ట్లో రోజురోజుకీ రెడిమిక్స్కు ఆదరణ పెరుగుతోంది. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా,పెసరట్లు, రవ్వదోశ తదితర వాటితో పాటు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే మ్యాగీనూడిల్స్, పాస్టా, కార్న్ఫ్లాక్స్, ఓట్స్, వేడివేడి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లాక్స్, చాకోస్‌తో పాటు ఫ్రెంచ్‌ఫ్రైస్ (ఆలు ఫింగర్చిప్స్)లాంటి చిరుతిళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇన్స్టంట్ల మిక్స్‌ల ధరలు రూ.30 నుంచి రూ.200ల వరకు ఆందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఫుడ్స్ తినడానికి తయారు చేసుకోవడానికి పెద్దగా సమయం లేక పోవడంతో పాటు రుచిగా ఉండడంతో ప్రజలు కోవిడ్ బారిన పడకుండా బయట హోటళ్లలో తినకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటూ అనారోగ్యాల బారిన పడకుండా చూసుకుంటకున్నారు. సమయం కలిసొస్తుంది తక్కువ సమయంలో మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ రెడీఫుడ్స్ ద్వారా సమయం కలిసొస్తుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తక్కువ సమయంలోనే టిఫిన్ తయారు చేసుకునేందుకు వీటి వల్ల అవకాశం ఉంటుంది. దీంతో పాటు మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ ఫుడ్ రుచికరంగా ఉంటున్నాయి. – సంతోష్‌కుమార్, పెద్దశంకరంపేట రుచికరంగా ఉన్నాయి మార్కెట్లో రకరకాలుగా దొరికే ఇన్స్టంట్ ఫుడ్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉండడం వల్ల వీటికి ఎక్కువగా కొంటున్నాం. తక్కువ సమయంలో అవసరమైన టిఫిన్ తయారు చేసుకోవచ్చు. ధర తక్కువ ఉండడం, బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ సమయం లేకుండా తయారు చేసుకుంటుండడం వల్ల సమయం వృథా కాదు. – శ్రీనివాస్, పెద్దశంకరంపేట -
నూడుల్స్ వివాదం పరిష్కరించుకుంటాం
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ నూడుల్స్‌కి అనుమతుల వివాదాన్ని పతంజలి ఆయుర్వేద సామరస్యంగా పరిష్కరించుకుంటుందని సంస్థను ప్రమోట్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. తమకి ఇచ్చిన అమ్మకం లెసైన్సు, తయారీ లెసైన్సును తీసుకుని సంస్థ ప్రతినిధులు ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులను కలుస్తారని ఆయన వివరించారు. సమన్వయ లోపం వల్లే ఈ వివాదం తలెత్తి ఉండొచ్చని, ఇది సామరస్యంగా పరిష్కారం కాగలదని బాబా రాందేవ్ పేర్కొన్నారు. ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మాకు అనుమతులు ఉన్నాయి. అలాగే, కాంట్రాక్టు ప్రాతిపదికన నూడుల్స్‌ను మాకోసం తయారు చేస్తున్న సంస్థలకు కూడా అనుమతులు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఈ వివాదంపై స్పందించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ నిరాకరించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఇటీవల ఇన్స్టంట్ నూడుల్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంస్థకు ఇన్స్టంట్ నూడుల్స్‌ను తయారు చేసే అనుమతులు లేవంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ ఆశీష్ బహుగుణ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దీన్ని పతంజలి ఆయుర్వేద సంస్థ ఖండించింది. -
ఇన్స్టంట్ నూడుల్స్‌తో ఆరోగ్యానికి చేటు..
‘ఇన్స్టంట్ నూడుల్స్’ అంటూ హోరెత్తించే ప్రకటనల ప్రభావంతో త్వరగా తయారు చేసుకోగల నూడుల్స్‌నే మీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకుంటున్నారా..? అయితే, మీరు చాలా ఆరోగ్య సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్నట్లే! దక్షిణ కొరియాలో జరిపిన ఒక పరిశోధనలో నూడుల్స్ వల్ల తలెత్తే అనర్థాలు వెలుగులోకి వచ్చాయి. నూడుల్స్ తింటే శరీరంలోని రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి దుష్ఫలితాలు కలుగుతాయని, చివరకు గుండెజబ్బులకు, పక్షవాతానికి గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని ఆ పరిశోధనలో తేలింది. నూడుల్స్‌లోని అధిక మోతాదులో ఉండే సోడియం, అన్‌శాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఈ దుష్ర్పభావాలు కలుగుతాయని దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యున్ షిన్ వివరిస్తున్నారు.