తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా...
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడంపై బాబా రామ్‌దేవ్ స్పందించారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం విస్పష్టంగా చాటిందని అన్నారు. గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే.
తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగకుండా హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు సిర్సాలో గుర్మీత్ మద్దతుదారులు రెచ్చిపోయారు. రెండు కార్లను వారు దగ్ధం చేశారు.