Gurmeet Ram Raheem Singh
-
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా(55)కు కోర్టు 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గతంలోనూ అంటే గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన కోర్టు ఇతడికి పెరోల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచే ఆన్లైన్ ద్వారా పలు సత్సంగ్‌లు నిర్వహించారు. వీటికి కొందరు హరియాణా బీజేపీ నేతలు సైతం హాజరయ్యారు. తాజా పెరోల్ సమయంలో ఈ నెల 25న జరగనున్న డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ జయంత్యుత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు -
డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
పంచ్‌కుల: జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతి హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబా, మరో ముగ్గురికి జీవిత కారాగారం విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. బాబా, అతని అనుయాయులు నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్, కృష్ణలాల్ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతిని చంపేశారు. డేరా బాబా ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ చత్రపతి తన పత్రికలో కథనం ప్రచురించడమే ఇందుకు కారణం. -
హనీప్రీత్ అరెస్ట్
చండీగఢ్: దాదాపు నెల రోజులుగా పోలీసులకు దొరకకుండా వస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ ఇన్సాన్‌ను ఎట్టకేలకు హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం కేసులో గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమెను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హనీప్రీత్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పంచకుల పోలీసు కమిషనర్ ఏఎస్ చావ్లా వెల్లడించారు. పంచకులలో చెలరేగిన హింసలో ఆమె ప్రమేయంపై విచారిస్తామన్నారు. అదృశ్యం తర్వాత ఎవరెవరు హనీప్రీత్‌కు సహకరించారు అనే విషయాన్నీ విచారిస్తామని చెప్పారు. బుధవారం ఆమెను పంచకులలోని కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు రిమాండ్‌కు కోరతామని తెలిపారు. హనీప్రీత్‌తోపాటు ఉన్న మరో మహిళను కూడా కస్టడీలోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నేను, మా నాన్న అమాయకులం.. అరెస్టుకు కొద్ది గంటల ముందే హనీప్రీత్ రెండు ప్రముఖ వార్తా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పంచకుల అల్లర్లకు తనను బాధ్యురాలిని చేస్తూ కేసు నమోదు చేయడం ఆవేదన కలిగించిందని హనీప్రీత్ చెప్పారు. హరియాణా పోలీసులు తనపై అన్యాయంగా లుక్ఔట్ నోటీసులు, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. ‘‘నేను అల్లర్లు ప్రోత్సహించేలా కనిపిస్తున్నానా? అలా ఎలా ఆరోపణలు చేస్తారు?. నా తండ్రికి శిక్ష పడిన రోజు ఒక కూతురుగా ఆయన పక్కన ఉన్నాను. నేను ప్రజలను రెచ్చగొడుతూ ఒక్క మాట అయినా పలికానా.. అలాంటప్పుడు నన్ను నిందితురాలిగా ఎలా పేర్కొంటారు. నేను చట్టం కళ్లుగప్పి ఎక్కడికి పారిపోలేదు. పంచకులలో చెలరేగిన హింసకు నన్ను బాధ్యురాలిని చేయడంతో పూర్తిగా కుంగిపోయాను. నా తండ్రి నిర్దోషిగా బయటకు వస్తారనే ఆశతోనే ఆ రోజు కోర్టుకు వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు శిక్ష పడింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. పూర్తిగా షాక్‌లో ఉండిపోయాను. అలాంటి విపత్కర సమయంలో మిగతావాటి గురించి ఎలా ఆలోచించగలను. ఒక్కసారి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నా తండ్రితో కలసి దేశ భక్తి సినిమాలు తీశాను. అలాంటి నాపై దేశ ద్రోహం ఆరోపణలు చేశారు. అంతపెద్ద ఆరోపణలు జీర్ణించుకోలేకపోయాను. నేను కనీసం చీమను కూడా చంపను. నాకు న్యాయ ప్రక్రియ అంటే అర్థం కూడా తెలీదు. నా వరకు నా తండ్రి గుర్మీత్ జైలు వెళ్లడం ఎంతో బాధించింది. నా ప్రపంచం మొత్తం కుప్పుకూలినట్లైంది. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. కొంతమంది ఇచ్చిన సూచనల ప్రకారం ఢిల్లీకి వెళ్లాను. ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయిస్తాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది. తప్పక న్యాయం జరుగుతుంది. గుర్మీత్‌తో అక్రమ సంబంధం గురించి నా మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణల గురించి నేను మాట్లాడను. గుర్మీత్‌కు, నాకు మధ్య పవిత్ర బంధం ఉంది. మా మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రీకూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా తండ్రి అమాయకుడు. రానున్న రోజుల్లో ఆ విషయం అందరూ తెలుసుకుంటారు. డేరా కార్యాలయంలో కొందరు శిష్యురాళ్ల మృతదేహాలను పూడ్చిపెట్టారంటున్నారు. ఇంతవరకు ఒక్క అస్థిపంజరాన్ని అయినా గుర్తించారా? లేదు కదా’’ అని హనీప్రీత్ చెప్పారు. -
జైలులో చెమటోడుస్తున్న డేరా బాబా
-
జైలులో చెమటోడుస్తున్న డేరా బాబా
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలులో రోజుకు రూ 20 సంపాదిస్తున్నాడు.కూరగాయలు పెంచడం, చెట్లను ట్రిమ్ చేయడం వంటి పనుల్లో ఆయన నిమగ్నమయ్యాడు. సువిశాల డేరా ప్రాంగణంలో విలాస జీవితం గడిపిన గుర్మీత్ జైలులో రోజుకు ఎనిమిది గంటలు కష్టపడుతున్నాడు. అత్యాచార కేసుల్లో సీబీఐ కోర్టు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఇక రోహ్తక్ జైలులోని తన బ్యారక్ పక్కనే ఉన్న కొద్దిపాటి భూమిలో ఆయన కూరగాయలు పండిస్తున్నాడని, ఇప్పటికే తన పని మొదలుపెట్ఆటడని హర్యానా డీజీపీ కేపీ సింగ్ చెప్పారు. ఆ భూమిలో పండించిన దిగుబడిని జైల్ మెస్‌లో ఉపయోగిస్తారని తెలిపారు. 1967, ఆగస్ట్ 15న రాజస్ధాన్‌లోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రామ్ రహీం బాల్యంలో తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరించేవాడు.జైలులో సైతం ఆయన ఇదే పని ఎంచుకున్నాడని, సాగు పనులు నైపుణ్యంలేని పనుల క్యాటగిరీలో ఉండటంతో ఆయనకు రోజుకు రూ 20 కూలి చెల్లిస్తారని డీజీపీ చెప్పారు. మరోవైపు గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం లేదని, ఆయనను సాధారణ ఖైదీలాగానే జైలు అధికారులు పరిగణిస్తున్నారని అన్నారు. గుర్మీత్ బ్యారక్‌లో టీవీ లేదని, ఆయనను ఇతర సామాన్య ఖైదీలాగానే చూస్తున్నారని ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే ఆయనకూ ఇస్తున్నారని చెప్పారు. -
అల్లర్ల కోసం ఐదు కోట్లిచ్చారు...
సాక్షి, పంచ్‌కుల : అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ తీర్పు నేపథ్యంలో హింసాకాండకు దిగాలని మద్దతుదారులకు రూ 5 కోట్లు ముట్టచెప్పాడు. డేరా సచా సౌధా కీలక సభ్యులు ఆదిత్య ఇన్సాన్, హనీప్రీత్ ఇన్సాన్, సురేందర్ ధిమన్ ఇన్సాన్లను సిట్ సభ్యులు విచారించిన క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. డేరా యాజమాన్యం నుంచి నిధుల వసూలు చేసి ఖర్చు చేయడంలో డేరా పంచ్‌కుల బ్రాంచ్ హెడ్ చంకూర్ సింగ్ కీలకంగా వ్యవహరించినట్టు సిట్ విచారణలో తేలింది.ఆగస్టు 28న హైకోర్టు ఆదేశాలతో చంకూర్ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదైనప్పటి నుంచి మొహాలి జిల్లా దకోలికి చెందిన చంకూర్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలో ఉన్నాడు. అత్యాచారం కేసులో గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం పంజాబ్‌లో అల్లర్లు చెలరేగిన పలు ప్రాంతాలకూ డేరా మేనేజ్మెంట్ హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు పంపినట్టు తెలిసింది. హింసాకాండ సందర్భంగా మరణిస్తే అందుకు తగిన పరిహారం చెల్లిస్తామని తమకు హామీ ఇచ్చారని డేరా అనుచరులు తెలిపారు. చంకూర్ను అరెస్ట్ చేసిన తర్వాత దీనిపై మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని, అతని కోసం తమ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. ఆందోళనకారులకు వాహనాలు సమకూర్చేవారిపైనా నిఘా ఉంచామని తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త కీలకంగా వ్యవహరించారని, హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు కూడా సమకూర్చారని డీజీపీ చెప్పారు. -
డేరాలో ఏమున్నాయో తెలిస్తే ఔరా అనాల్సిందే...
సిర్సాః రాక్‌స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రధాన కార్యాలయంలో సకల భోగాలు అనుభవించాడు. కళ్లు చెదిరే భవంతులూ, చారిత్రక కట్టడాలను తన చెంతనే నిర్మించుకున్నాడు. డేరా ప్రాంగణంలోనే ఈఫిల్ టవర్, తాజ్ మహల్, డిస్నీలాండ్ల నమూనాలను సృష్టించాడు.సువిశాల 700 ఎకరాల ప్రాంగణంలో ప్రపంచంలోని ఏడు వింతలను ఆవిష్కరింపచేయాలని ప్లాన్ చేశాడు. అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ డేరాలో ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో ఆ ప్రదేశాన్ని వీక్షిస్తే స్పష్టమవుతుంది.డేరా క్యాంపస్ అంతటా లగ్జరీ క్యాసిల్స్, రిసార్ట్స్, మొఘల్ కోర్ట్స్ కనిపిస్తాయి.భారీ ఓడ సైతం ప్రాంగణంలో నిలిపిఉంది.డేరా ముఖద్వారంలోనే గోడపై పలు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇక గుర్మీత్ సింగ్ నటించే సినిమాలు షూటింగ్ జరిగే ఫిల్మ్ సిటీ కూడా డేరా ప్రాంగణంలో కొలువుదీరింది. ఫిల్మ్ సిటీలోపలకు అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించడానికి వీలులేకుండా ఎలక్ర్టిక్ వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. మరోవైపు గుర్మీత్ గుట్టుమట్లను ఛేదించేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జ్ సారథ్యంలో అధికారులు డేరా ప్రాంగణంలో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో డేరా లోపల, వెలుపల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ బృందం సోదాల అనంతరం బాబాకు సంబంధించి మరిన్ని రహస్యాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయి. -
తీర్పు ప్రకంపనలు...బర్నాలాలో కర్ఫ్యూ
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన క్రమంలో అక్కడక్కడా డేరా బాబా మద్దతుదారులు రెచ్చిపోయారు. సిర్సాలో రెండు కార్లను దగ్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా హర్యానా, పంజాబ్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని బర్నాలాలో రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరుకూ కర్ఫ్యూ విధించారు. మరోవైపు హింసకు పాల్పడిన వారెవరినీ విడిచిపెట్టబోమని, విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సిర్సా ఐజీ ఏఎస్ థిల్లాన్ చెప్పారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారైన అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. -
గుర్మీత్ రాక్‌స్టార్ బాబాగా ఎలా మారాడు ?
-
తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా...
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడంపై బాబా రామ్‌దేవ్ స్పందించారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం విస్పష్టంగా చాటిందని అన్నారు. గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే. తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగకుండా హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు సిర్సాలో గుర్మీత్ మద్దతుదారులు రెచ్చిపోయారు. రెండు కార్లను వారు దగ్ధం చేశారు. -
ఆన్లైన్ గురుకుల్!
యమ్.యస్.జి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన కూతురు హానీ ప్రీత్ ఇన్సాన్ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘యమ్.యస్.జి. ఆన్లైన్ గురుకుల్’. గుర్మీత్ 50వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో జరుగుతున్న చెడును నిర్మూలించే ఒక సైబర్ పోలీసాఫీసర్ పాత్రను ఇందులో పోషిస్తున్నాను. సినిమాల ద్వారా మంచి సందేశం ఇవ్వడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయడం నాకిష్టం. ఇటీవల ఉత్తర భారతదేశంలో రక్తదానం, అవయవదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి దక్షిణ భారతదేశంలో కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకున్న భార్యాభర్త లకు ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందజేశారు. -
సెన్సార్ బోర్డు వర్సెస్ కేంద్రం!
‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై ముదిరిన వివాదం సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ రాజీనామా న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ చిత్రం విడుదల వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయంటూ దాని విడుదలకు అనుమతిని కేంద్ర సెన్సార్ బోర్డు నిరాకరించగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఎఫ్‌సీఏటీ) మాత్రం ఆ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడం దుమారం రేపింది. దీనిపై కలత చెందిన సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ గురువారం రాజీనామా చేయగా శుక్రవారం శాంసన్‌కు మద్దతుగా సెన్సార్ బోర్డు సభ్యురాలు ఐరా భాస్కర్ రాజీనామా చేశారు. కేంద్రం పరిధిలోని ఎఫ్‌సీఏటీ ఈ చిత్రం విడుదలకు అనుమతివ్వడం సెన్సార్ బోర్డును ఎగతాళి చేయడమేనని శాంసన్ అన్నారు. బోర్డులో ఇటీవలి కాలంలో కొన్ని కేసుల్లో ప్రభుత్వ జోక్యం, ఒత్తిళ్లు, ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి వంటి కారణాల వల్ల సెన్సార్ బోర్డు చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు శాంసన్ చెప్పారు. అయితే శాంసన్ ఆరోపణలను సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తోసిపుచ్చారు. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం లేదని, ప్రభుత్వ జోక్యం ఉందంటున్న శాంసన్ అందుకు ఆధారాలు చూపాలన్నారు. మరోవైపు ఈ వివాదం నడుమ ఈ చిత్రం విడుదల శుక్రవారానికి బదులు ఆదివారానికి వాయిదా పడింది. ఈ చిత్రంలో రామ్ రహీమ్ సింగ్ తనను తాను దేవుడిగా, సిక్కుల గురువుగా చెప్పుకున్నాడంటూ సిక్కు సంఘాలు ఆందోళనకు దిగడంతో పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రహీమ్ సింగ్ శుక్రవారం గుర్గావ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన చిత్రం ఏ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కాగా, సెన్సార్ బోర్డులోని మరో సభ్యురాలు నందిని సర్దేశాయ్ మాట్లాడుతూ సినిమా విడుదలపై 15-30 రోజుల్లో నిర్ణయం తీసుకునే ఎఫ్‌సీఏటీ కేవలం 24 గంటల వ్యవధిలోనే ‘మెసంజర్ ఆఫ్ గాడ్ ’ విడుదలకు అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.