తీర్పు ప్రకంపనలు...బర్నాలాలో కర్ఫ్యూ
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన క్రమంలో అక్కడక్కడా డేరా బాబా మద్దతుదారులు రెచ్చిపోయారు. సిర్సాలో రెండు కార్లను దగ్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా హర్యానా, పంజాబ్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని బర్నాలాలో రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరుకూ కర్ఫ్యూ విధించారు.
మరోవైపు హింసకు పాల్పడిన వారెవరినీ విడిచిపెట్టబోమని, విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సిర్సా ఐజీ ఏఎస్ థిల్లాన్ చెప్పారు. గుర్మీత్‌కు శిక్ష ఖరారైన అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.