cbi court
-
నీరవ్ మోదీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, ముంబయి : పీఎన్బీ స్కామ్ కేసుకు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్‌కు చెందిన మొహుల్ చోక్సీలకు సీబీఐ కోర్టు ఆదివారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. తప్పుడు పత్రాలతో వీరు పీఎన్బీ నుంచి భారీ మొత్తంలో రుణాలు పొంది వాటిని దారిమళ్లించిన వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీఎన్బీ ముంబయి బ్రాంచ్ అలహాబాద్, యాక్సిస్ బ్యాంక్ హాంకాంగ్ బ్రాంచ్‌లకు జారీచేసిన హామీ పత్రాల (ఎల్ఓయూ)పై నీరవ్ మోదీ ఇతరులు రూ 280.7 కోట్లు మోసపూరితంగా పొందినట్టు తేలడంతో ఈ భారీ స్కాం బయటపడింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్‌ల తరపున ఎల్ఓయూలు జారీ అయ్యాయి. కుంభకోణం వెలుగుచూసిన అనంతరం నీరవ్ మోదీ ఇతర నిందితులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద కూడా కేసు నమోదైంది. -
తీర్పుపై బాబా రాందేవ్ స్పందన ఇలా...
న్యూఢిల్లీః అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించడంపై బాబా రామ్‌దేవ్ స్పందించారు. కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం విస్పష్టంగా చాటిందని అన్నారు. గుర్మీత్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి పదేళ్ల శిక్షను ఖరారు చేసిన విషయం విదితమే. తీర్పు నేపథ్యంలో అల్లర్లు చెలరేగకుండా హర్యానా, పంజాబ్, ఢిల్లీల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు సిర్సాలో గుర్మీత్ మద్దతుదారులు రెచ్చిపోయారు. రెండు కార్లను వారు దగ్ధం చేశారు. -
ఎవరి ప్రలోభాలకు లొంగలేదు..
ఢిల్లీ: హిందాల్కో బొగ్గు గనుల కేటాయింపు సందర్భంగా తాను ఎవరి ప్రలోభాలకు లొంగలేదని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శుక్రవారం సీబీలో కోర్టులో తన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. బొగ్గు గనుల కేటాయింపుకోనం తాను ఎవర్నీ ప్రభావితం చేయలేదని మన్మోహన్ సీబీఐ కోర్టుకు స్పష్టం చేశారు. కుమార మంగళం బిర్లాకు గనుల కేటాయింపు చేస్తానంటూ ఎవరికీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికోసం బిర్లా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు లేఖలు రాశారని తెలిపారు. అయితే ఆ లేఖలను నిశిత పరిశీలన కోసం సంబంధిత శాఖలను పంపించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తాను ఎక్కడా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని తెలిపారు. కాగా యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కోల్ గోట్ స్కాం మన్మోహలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.