
బాబా రామ్‌దేవ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్ భవిష్యత్తులో భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చునని ఓ అంతర్జాతీయ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. అంతే కాదు రామ్‌దేవ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చుతూ.. ట్రంప్‌లా అతను కూడా దేశానికి నాయకత్వం వహిస్తారని పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు ఉన్న ఆదరణ, వ్యాపారం, మార్కెటింగ్ వంటి అంశాల్లో రామ్‌దేవ్ కూడా అదే స్థాయిలో ఉన్నారని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తీసుకురావడంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నారని, పతాంజలి ఉత్పత్తులతో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నట్లు పేర్కొంది.
ట్రంప్ కూడా వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. ప్రస్తుతం అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయ్యారని, రామ్‌దేవ్ కూడా భవిషత్తులో భారత ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. నరేంద్ర మోదీ తరువాత దేశంలో అంతటి ఆదరణ గల వ్యక్తిగా బాబాను కొనియాడింది. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అతనికి యోగా, పతాంజలి పరంగా మంచి గుర్తింపు ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 'ది బిలియనీర్ యోగి బిహైడ్ మోడీ రైజ్'.. మోడీ ఎదుగుదల వెనుక బిలియనీర్ యోగి, పేరుతో కథనం ఇచ్చింది. రామ్‌దేవ్ బాబా భారత్‌తో పాటు విదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment