న్యూఢిల్లీ : ఉద్యోగం కోసం వెతుకుతున్నారా....? అయితే ఈ అవకాశం అందిపుచ్చుకోడంట. ఎఫ్‌ఎంసీజీ రంగంలో వేగవంతంగా దూసుకెళ్తోన్న బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని పతంజలి ఆయుర్వేద సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తమ పతంజలి వ్యాపారాల్లో పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఈ సంస్థ బుధవారం ఈ ప్రకటన చేసింది. ప్రతి జిల్లాలో పతంజలి ఉత్పత్తులను నిర్వహించే బాధ్యతల కోసం సేల్స్‌మెన్ పోస్టులను ప్రకటించింది. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మంది వరకు సేల్స్‌మెన్‌ను నియమించుకోవాలని గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఫుడ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఆశా పూజ ఐటమ్స్ వంటి పతంజలి బ్రాండుల్లో కూడా ఈ ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేస్తోంది.
- పతంజలి ఉద్యోగాలకు అర్హత : కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత, బీఏ/ఎంఏ/ఎంబీఏ. ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఒకటి లేదా రెండేళ్ల అనుభవమున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత.
- ఎంపిక, శిక్షణ క్యాంప్‌ను 2018 జూన్ 23 నుంచి 27 తేదీల్లో నిర్వహిస్తారు. 2018 జూన్ 22 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ తప్పనిసరి)
- పతంజలి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సేల్స్‌మెన్‌కు వేతనాలు చెల్లిస్తారు.
- ప్రతి జిల్లాలో 40 నుంచి 50 సేల్స్‌మెన్ కావాలి. హోమ్ డెలివరీ, రెడీ స్టాక్ సేల్స్‌కు 50 నుంచి 100 మంది యువత కావాలి.
- వేతనం నగరం, కేటగిరీ, అర్హత బట్టి రూ.8000 నుంచి రూ.15000 మధ్యలో ఉంటుంది.
- ఈ రిక్రూట్‌మెంట్ గురించి తమ అధికారిక కో-ఆర్డినేటర్‌ను లేదా ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా సంపద్రించాలని సూచించింది. ఈ ఉద్యోగానికి ఏ ఏజెంట్‌కు నగదు చెల్లించవద్దని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment