
యోగా డేకు భారీ సన్నాహాలు
తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా కవరేజ్ చేసేందుకు దూరదర్శన్ (డీడీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న ఢిల్లీలోని రాజ్‌పథ్
రిపబ్లిక్ డే తరహా కవరేజ్‌కు డీడీ ప్రణాళిక
20 హై డెఫినిషన్ కెమెరాలతో చిత్రీకరణ
అత్యాధునిక సాంకేతిక పరికరాల వినియోగం
న్యూఢిల్లీ: తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా కవరేజ్ చేసేందుకు దూరదర్శన్ (డీడీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21న ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే తరహాలో కవర్ చేసేందుకు డీడీ సన్నద్ధమవుతోంది. ఇందుకు 20 హై డెఫినిషన్ కెమెరాలు వినియోగిస్తోంది. రెండు కెమెరాలు ఇండియా గేట్‌పైన, విహంగ వీక్షణం చేయడానికి ఉపయోగపడేలా పలు అడుగుల ఎత్తులో హైడ్రాలిక్ క్రేన్‌పై ఒక కెమెరాను ఉపయోగించనుంది.
వేదికపై యోగాసనాలు ప్రదర్శించే వారి సంఖ్య అధికంగా ఉండనున్న నేపథ్యంలో వారందరినీ చిత్రీకరించేందుకు 18 కెమెరాలను ఉపయోగించనుంది. లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు వీలుగా పలు అవుట్ డోర్ బ్రాడ్‌కాస్ట్ వ్యాన్లను రంగంలోకి దించుతోంది. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, సినిమాటోగ్రాఫర్స్, సినిక్, ప్రాపర్టీ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. మొత్తంగా కవరేజ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించనున్నట్లు ప్రసార భారతి చైర్‌పర్సన్ సూర్యప్రకాశ్ తెలిపారు. ఆలిండియా రేడియో సైతం యోగా డే నాడు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది.
రామ్‌దేవ్ బాబా రిహార్సల్
యోగా గురు రామ్‌దేవ్ ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తన అనుచరులు, చిన్నారులతో యోగా డే సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయక పతంజలి యోగ్‌పీఠ్‌కు చెందిన 5,200 మంది యోగా శిక్షకులు, చిన్నారులతో సహా ఇతర అభ్యాసకులు ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన యోగా ప్రొటోకాల్‌ను 35 నిమిషాల సేపు రిహార్సల్ చేశారు. ఇందులో రామ్‌దేవ్ బాబా పలు యోగాసనాలను ప్రదర్శించారు.