'డెంగీ చికిత్సకు ఆయుర్వేదం మందులిస్తా' | will cure dengue fever by ayurvedic medicine | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 17 2015 7:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

- డెంగీ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం- డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలి: బాబా రాందేవ్ న్యూఢిల్లీ: డెంగీ జ్వరాల బారినపడి దేశంలో చాలామంది మరణించారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. డెంగీ మరణాలపై స్పందించిన ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల డెంగీ జ్వరాలతో 15మంది మృత్యువాత పడ్డారని మండిపడ్డారు. డెంగీని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డెంగీని ఆయుర్వేద పద్ధతిలో నివారిస్తామని స్పష్టం చేశారు. డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలని బాబా రాందేవ్ సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement