Dengue deaths
-
ఢిల్లీలో డెంగీ తొలి మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్ డిసీజ్ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్‌కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్ 20న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్‌లో పది, మేలో 12, జూన్‌లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్‌లో 72, సెప్టెంబర్‌లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్‌గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్‌పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ) -
కొనసాగుతున్న డెంగీ మరణాలు
మంచిర్యాల జిల్లాలో డెంగీ కాటుకు బలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం, పారిశుధ్యం మెరుగుపరచడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా డెంగీ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 15 మంది డెంగీ కారణంగా మృత్యువాత పడినా.. ఒక్కరే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వారం వ్యవధిలోనే 17 మందికి డెంగీ సోకినట్లు అధికారిక వర్గాలే వెల్లడించడం జిల్లాలో పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. సాక్షి, మంచిర్యాల: జిల్లాలో డెంగీతో మృత్యువాత పడ్డ వారి వివరాలు (అనధికారికంగా) : జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన గుడిమల్ల రాజగట్టు(30), అతని భార్య సోనీ (28), కూతురు శ్రీవర్షిణి (6), తాత ఈదా లింగయ్య (80) మృతి. (ఇందులో సోనీ డెంగీతో మృతిచెందినట్లు అధికారికంగా వెల్లడించారు.) కాసిపేట మండలానికి చెందిన రాందేవ్ మృతి. (డెంగీ సోకినట్లు కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్ధరించింది.) కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సౌందర్య(19). కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన దుగుట పోశం (64). కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన జాడి మల్లయ్య (53). కాసిపేట మండలం రేగులగూడకు చెందిన నవీన్ (20). క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజోన్ రాంనగర్‌కు చెందిన యువతి కల్వల స్నేహా (23). తాండూర్ మండలం రేచినికి చెందిన గొర్రెల కాపరి గుడిముర్కి తిరుపతి (37) తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మృతి. భీమారం మండలం కొత్తపల్లి›గ్రామానికి చెందిన ఆకుల రాజశ్రీ (19) డెంగీ జ్వరంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన కామెర పోశం. జన్నారం మండలం దేవునిగూడకు చెందిన అనిల్‌రావు. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట లక్ష్మి. నెన్నెల మండల కేంద్రానికి చెందిన జంపాల రాజేశ్వరి. వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ వరుసగా వర్షాలు కురుస్తుండడం.. పారిశుధ్య లోపం.. డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలో డెంగీ విజృంభణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు కుటుంబసభ్యులను డెంగీ బలి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. డెంగీ జ్వరాలు జిల్లాలో ప్రమాదకరంగా మారినా యంత్రాంగం మాత్రం తమ నిద్రమత్తును వదలడం లేదు. అవి డెంగీ మరణాలు కావంటూ కొట్టిపారేస్తూ.. మరణాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కాని పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్రమాదకర డెంగీ జ్వరంపై అవగాహన కల్పించడాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకూ డెంగీ జ్వరపీడితుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారమే డెంగీ నిర్ధారణ కేసులు కేవలం వారం వ్యవధిలో 17 కేసులు పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. అక్టోబర్ 29వరకు జిల్లావ్యాప్తంగా 67 మందికి డెంగీ సోకినట్లు అధికారికంగా వెల్లడించారు. మంగళవారం నాటికి ఆ సంఖ్య 84కు చేరుకుంది. అంటే కేవలం వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ సోకినట్లయ్యింది. 15 మంది మృత్యువాత జిల్లాలో డెంగీ మరణాలు ఆగడం లేదు. డెంగీ జ్వరాలతో మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం తరువాత కూడా డెంగీ మరణాలు కొనసాగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కాసిపేట మండలంలో ఐదుగురు, ఇతర మండలాల్లో కలిపి మొత్తం 15 మంది డెంగీతో మరణించినట్లు ఆయా కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వీరంతా సాధారణ జ్వరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగానే మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం మంచిర్యాలకు చెందిన సోనీ మాత్రమే డెంగీతో మృతి చెందినట్లు చెబుతున్నారు. నివారణ చర్యలేవి..? జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు విజృంభిస్తుంటే మరోవైపు నివారణ చర్యలు నామమాత్రంగా మారాయి. 15 మంది మృత్యువాత పడినా.. వందలాది మందికి డెంగీ ప్రబలుతున్నా.. సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఎంతసేపూ.. అవి డెంగీ మరణాలు కావని చెప్పడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే.. ఏ జ్వరమైనా ప్రాణాలు పోవడం నిజమనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. పైగా 84 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులే వెల్లడించినా.. డెంగీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా కనిపించడం లేదు. మంచిర్యాలలో నలుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆ కాలనీలో కాస్త హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. జిల్లా కేంద్రంలోనే పారిశుధ్యం అధ్వానంగా మారింది. దోమల నివారణకు మందు పిచికారీ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం, నీటి నిలువను లేకుండా చేయడంవంటి చర్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. పైగా డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
డెంగీ మరణాలపై లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ మరణాలపై లెక్కలు తేల్చి ఒకట్రెండ్రోజుల్లో సమగ్ర నివేదికను తనకు అందివ్వాలని వైద్యాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు కొనసాగుతున్నా సంబంధిత వైద్యాధికారులకు ఆ ఘోష వినపడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ గోప్యంగా ఉంచింది. కొద్దిపాటి వివరాలనే బయటకు వెల్లడించింది. కానీ, ఆ సమావేశంలో డెంగీ మరణాలపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇద్దరే డెంగీతో చనిపోయారంటూ అధికారులు మంత్రినే తప్పుదోవ పట్టించడంతో ఈటల వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఒకే కుటుంబంలో నలుగురు డెంగీతో చనిపోయినా ఆ విషయం మీకు తెలియదా అని నిలదీశారు. కొందరు డెంగీతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా చనిపోయారని వైద్యాధికారులు చెప్పడానికి ప్రయత్నించగా మంత్రి తీవ్రస్థాయిలో క్లాస్ తీసుకున్నారు. ‘ఏదైనా చెబితే కాస్తంతైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఎంతోమంది చనిపోతుంటే కేవలం ఇద్దరే అని చెప్పడం హాస్యాస్పదమ’ని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో చివరకు 52 నుంచి 57 మంది డెంగీతో చనిపోయారని అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. డెంగీ మరణాలపై వేసిన కమిటీ ఏం చేసింది? మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీశ్రీనగర్‌లో ఒకే కుటుంబంలో నలుగురు డెంగీతో చనిపోయిన ఘటనపై ఆ జిల్లా వైద్యాధికారితో ఈటల మాట్లాడారు. ఘటనపై నివేదికను అందజేయాలని వైద్యాధికారుల్ని కోరారు. ‘డెంగీతోనే వారు చనిపోయి నట్లు అక్కడి వైద్యాధికారులు చెబుతుంటే మీరు మాత్రం ఇప్పటికీ ఇద్దరే అంటున్నార’ని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ మరణాలపై నిర్ధారణకు నెలన్నర క్రితం వేసిన కమిటీ ఏం తేల్చిందని ఆయన అధికారులను నిలదీశారు. అయితే ఆ కమిటీ ఇప్పటివరకు ఏ పురోగతి సాధించలేదని తెలిసింది. 15 వేలకు పైగా డెంగీ కేసులు నమోదు రాష్ట్రంలో డెంగీ కేసులు 15 వేలకు పైగా నమోదైనట్లు, అందులో దాదాపు 150 మంది వరకు చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. అయితే డెంగీ మరణాలపై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని అధికారులను మంత్రి హెచ్చరించినట్లు తెలిసింది. డెంగీ నివారణకు సరైన చర్యలు తీసుకోకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నట్లు సమాచారం. నల్లగొండ మెడికల్ కాలేజీకి స్థల సేకరణ నల్లగొండ మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థల సేకరణ జరపాలని మంత్రి ఈటల ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ జిల్లా ఆస్పత్రిలోనే మెడికల్ కాలేజీ నడుస్తున్నందున వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 300 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని అధికారులు కోరగా, ఇప్పుడు సాధ్యం కాదని ఉన్నవారిని హేతుబద్దీకరించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీలు సిబ్బంది లేక మూతపడి ఉన్నాయని, వాటిని వైద్య విధాన పరిషత్‌కు అప్పగించే విషయం లోనూ చర్చ జరిగింది. -
డెంగీకి బలవుతున్నా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘డెంగీ వంటి విషజ్వరాలతో జనం చచ్చిపోతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేసినా ఫలితాలు కనబడటం లేదు. ఇప్పటికే ఎంతో సమయమిచ్చాం. సాక్షాత్తు ఒక జడ్జి డెంగీ కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ జడ్జి ఇంట్లో వైద్యులు కూడా ఉన్నారు. డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనకు పెద్ద పీట వేసుంటే ఎంతోమంది ప్రాణాల్ని కాపాడేందుకు వీలవుతుంది. ప్రజలు డెంగీ వంటి రోగాల బారినపడి చచ్చిపోతుంటే కళ్లు మూసుకుని ఉంటామని అనుకోవద్దు. ఇలాంటి విషయాల్లో తీవ్రంగానే స్పందిస్తాం..’అని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనం రోగాల బారిన పడుతుంటే ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని, డెంగీ కారణంగా మూడ్రోజుల క్రితం ఒక జడ్జి (హన్వాడకు చెందిన పి.జయమ్మ ఖమ్మంలో రెండో అదనపు ప్రథమశ్రేణి జడ్జి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో 19న కన్నుమూశారు.) మరణించారని, ఎవరైనా బ్యూరోక్రాట్ ఇంట్లో అలాంటి ఘటన జరిగితేగానీ ఉన్నతాధికారులు స్పందించరా అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారులు ఏం చేస్తున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ గురువారం జరిగే విచారణకు స్వయంగా హాజ రు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లేగు తరహాలో ప్రబలితే.. డెంగీ నివారణకు ప్రభుత్వ పరంగా చర్యలు నామమాత్రంగా ఉన్నాయని, డెంగీ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం, న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను పిల్‌గా పరిగణించిన వాటిని బుధవారం హైకోర్టు మరోసారి విచారించింది. వందల పేజీలతో దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా ప్రభుత్వం డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలు, డెంగీ నివారణకు అందిస్తున్న వైద్య సేవల సమాచారం పట్ల ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని ఏం చర్యలు తీసుకున్నారో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మనుషులు మోసే ఫాగింగ్ మెషీన్లు కాదని, డ్రోన్స్ ద్వారా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచన చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడింది. సరైన సమయంలో ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చునని, 1,300లో యూరప్‌లో ప్లేగు వచ్చి ఎంతోమంది ప్రజల్ని పొట్టనబెట్టుకుందని ధర్మాసనం గుర్తు చేసింది. మహమ్మారి కన్నెర్రజేస్తే పేదవాడు, ధనికుడు, రాజు, రాణి అనే తారతమ్యం ఉండదని, అప్పుడు యూరప్‌లో ఇద్దరు పోప్లు కూడా చచ్చిపోయారనే చారిత్రక విషయాన్ని తెలిపింది. కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది. ఇదే సరైన సమయం. మేల్కొనండి.. అని ప్రభుత్వానికి హితవు పలికింది. కార్చిచ్చు కాకముందే కళ్లు తెరవండి.. తొలుత వాదనలు ప్రారంభమైన వెంటనే ఏజీ లేచి.. డెంగీ నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని, జనం రోగాల బారినపడి ఇబ్బందులు పడుతున్నప్పుడే తాము అనేక సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడ్రోజుల క్రితం ఒక జడ్జి చనిపోయారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పైగా ఆ జడ్జి కుటుంబంలో డాక్టర్లు కూడా ఉన్నారని, అయినా డెంగీపై ప్రభుత్వం అవగాహన కల్పించని కారణంగా ప్రాణాలు పోయాయనే అభిప్రాయం ఏర్పడుతోందని వ్యాఖ్యానించింది. డెంగీ జ్వరాలు రావడానికి కారణాలేమిటి, అది రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు వేటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నట్లుగా హైదరాబాద్‌లోనే ఎక్కడా కనబడటం లేదని తప్పుపట్టింది. డెంగీ వంటి విషజ్వరాల్ని నిర్లక్ష్యం చేస్తే కార్చిచ్చులా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రచారం కూడా చేస్తున్నామని ఏజీ చెప్పారు. చిన్నచిన్న బోర్డుల్ని ఏర్పాటు చేశారేమో తెలియదు గానీ, హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హోర్డింగ్స్‌లో డెంగీ గురించి కనబడలేదని ధర్మాసనం తెలిపింది. నివారణ చర్యలు తీసుకున్నందునే దోమలు, విష జ్వరాల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని ఏజీ చెప్పగానే తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుని, సెప్టెంబర్‌లో 205 కేసులుంటే అక్టోబర్ నాటికి 409 అయ్యాయని, రోగుల సంఖ్య రెట్టింపైనట్లుగా మీరు అందించిన పత్రాల్లోనే ఉందని చెప్పింది. కౌంటింగ్ మెషీన్ కాదు.. కిల్లింగ్ మెషీన్లు కావాలి దోమల లెక్కల మెషీన్ల ద్వారా చూస్తే దోమల సంఖ్య తగ్గిందని ఏజీ చెప్పగానే మళ్లీ ధర్మాసనం.. దోమల కౌంటింగ్ మెషీన్ల కంటే దోమల కిల్లింగ్ మెషీన్లు అవసరమని గట్టిగా చెప్పింది. దోమల సంఖ్య తగ్గిందని, కొద్దిగానే దోమలు ఉన్నాయని ఏజీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఉన్న దోమలేమీ కూర్చుని ఉండవని, వ్యాప్తి చెందుతాయని, ఉన్నవి తిరగబడితే విషజ్వరాలు రావని గ్యారెంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఫ్రైడే మస్కిటో డ్రై డే.. అనే నినాదాన్ని (శుక్రవారం దోమల నియంత్రణ దినం) ప్రభుత్వం అమలు చేస్తోందని ఏజీ చెప్పారు. దీనిపై ధర్మాసనం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏటా గాంధీజయంతి అక్టోబర్ 2న మద్యం అమ్మకాల నిషేధం సందర్భంగా డ్రై డే.. అమలు చేస్తారని తెలుసునని, దోమల్ని అంతం చేసేందుకు ఒక రోజును ఎంచుకోవడం ఏమిటో, వారంలోని మిగిలిన ఆరు రోజుల మాటేమిటో, అసలు ఆ నినాదం ఏమిటో, ఆ భాష ఏమిటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది. -
వీడని డెంగీ...
డెంగీ జ్వరాలు జిల్లాను ఇంకా వదలడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు మృత్యువాత పడినా జ్వరాల నియంత్రణలో వైద్యశాఖా«ధికారులు సఫలీకృతులు కాలేకపోయారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో అంటురోగాలు ప్రబలి వరుస మరణాలు సంభవిçస్తున్నాయి. జిల్లా వైద్యాధికారులు మాత్రం డెంగీ జ్వరాలు లేవని చెబుతున్నా రిపోర్టులు మాత్రం డెంగీ లక్షణాలతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెబుతున్నాయి. తాజాగా ఎస్.కోట మండల కేంద్రంలోని పెద్దవీధికి చెందిన వసంత రామకృష్ణ (28), మెంటాడ మండలం లోతుగెడ్డకు చెందిన అగతాన పైడిరాజు (26) విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.దీంతో ఆయా గ్రామల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం, శృంగవరపుకోట రూరల్: డెంగీ లక్షణాలతో పట్టణంలోని పెద్దవీధికి చెందిన వసంత రామకృష్ణ (28) అనే వ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. శుక్రవారం ఉదయం మృతుని కుటుంబ సభ్యులు స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వసంత రామకృష్ణ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సావిత్రి, మూడేళ్ల కుమారుడు యశ్వంత్, నెల వయసు గల భవ్య అనే కుమార్తె ఉన్నారు. కూతురు నామకరణ మహోత్సవానికి గజపతినగరంలోని అత్తవారింటికి వెళ్లిన రామకృష్ణ తన తల్లికి బుధవారం ఫోన్ చేసి జ్వరం వచ్చిందని.. గురువారం పాపకు పేరు పెట్టిన అనంతరం ఆస్పత్రికి వెళ్తానని చెప్పాడు. అనుకున్నట్లు గానే కుమార్తెకు భవ్య అనే పేరు పెట్టి గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని మహారాజా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు రామకృష్ణను పరీక్షించి ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీంతో రామకృష్ణను కేజీహెచ్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రామకృష్ణ మృతితో భార్య సావిత్రి, ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.. జ్వర మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆరోపించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. అలాగే ఎక్కడబడితే అక్కడ చెత్త,చెదారాలు పేరుకుపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపించారు. ఇవి కచ్ఛితంగా ప్రభుత్వ హత్యలేనన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దోమలపై దండయాత్ర, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ అగతాన త్రినాథరావు, పార్వతమ్మల కుమారుడు అగతాన పైడిరాజు (26) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పైడిరాజుకు ఆయన తల్లి పార్వతమ్మలకు 15 రోజుల కిందట జ్వరం రావడంతో ముందుగా మెంటాడ ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడకు రెండు రోజుల తర్వాత పైడిరాజుకు కడుపునొప్పి గత శుక్రవారం గజపతినగరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.అక్కడి వైద్యుల సలహామేరకు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి పైడిరాజు ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని.. కామెర్లతో పాటు డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పైడిరాజును విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య రాధ, కుమారుడు ఉన్నారు. -
'డెంగీ చికిత్సకు ఆయుర్వేదం మందులిస్తా'
-
'డెంగీ చికిత్సకు ఆయుర్వేదం మందులిస్తా'
- డెంగీ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం - డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలి: బాబా రాందేవ్ న్యూఢిల్లీ: డెంగీ జ్వరాల బారినపడి దేశంలో చాలామంది మరణించారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. డెంగీ మరణాలపై స్పందించిన ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల డెంగీ జ్వరాలతో 15మంది మృత్యువాత పడ్డారని మండిపడ్డారు. డెంగీని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డెంగీని ఆయుర్వేద పద్ధతిలో నివారిస్తామని స్పష్టం చేశారు. డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలని బాబా రాందేవ్ సూచించారు.