Dengue fevers
-
డెంగ్యూ డేంజర్..
-
కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!
కరాచి: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇది డెంగ్యూ జ్వరం మాదిరిగానే రోగుల్లో ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాము డెంగ్యూ కోసం పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ అన్నారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. అయితే ఈ వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కానీ ఇది డెంగ్యూ జ్వరం కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
Dengue: డేంజర్ డెంగీ
1,205 రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన డెంగీ కేసులు 432 ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే నమోదైనవి డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట్, హన్మకొండ, ఖమ్మం. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వనపర్తి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్. గ్రేటర్లో ఫీవర్.. టెర్రర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధులు కోరలు చాస్తున్నాయి. కరోనా కేసులు ఒకవైపు నమోదు అవుతుండగా, మరోవైపు విషజ్వరాలు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగీ అత్యంత తీవ్రతలో 12 జిల్లాలు ఉండగా, మలేరియా అత్యంత తీవ్రతలో 11 జిల్లాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. అత్యంత తీవ్రత జిల్లాల్లోనే 70 శాతం మేర డెంగీ, మలేరియా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్తున్నా, కొన్ని జిల్లాల్లో వైద్య యంత్రాంగం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీగా కేసులు... రాష్ట్రంలో డెంగీ, మలేరియాతో పాటు చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో నీరు నిలిచినచోట్ల దోమలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. దీంతో దోమల కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాతో జనం ఆందోళన చెందుతుంటే, దానికి డెంగీ, మలేరియా తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా నమోదు అవుతాయని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. జ్వరాల కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనా లేదా డెంగీ జ్వరమో అర్థంగాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా, డెంగీతో వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఆసుపత్రుల తీరు మారడంలేదు. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 50 వేల వరకు గుంజుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 40 వేల లోపు ప్లేట్లెట్లు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ 50 వేలున్నా కూడా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. దోమల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే పరీక్షలు చేయించుకోండి జ్వరం ఉన్నవాళ్లు వైద్యున్ని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశముంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరగకుండా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పెద్దాసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయి. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. లక్షణాలున్నవారు ఆయా కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
డెంగీకి ప్రత్యేక చికిత్స
సాక్షి, మహబూబ్‌నగర్ : సీజనల్ వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తరపున ప్రత్యేక అవగహన కార్యక్రమాలు చేపడటంతో పాటు ఉచిత చికిత్స అందిస్తున్నామని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ అన్నారు. జనరల్ ఆస్పత్రిలోని సూపరిటెండెంట్ ఛాంబర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ఇలాంటిì సమయంలో ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, చెత్త చేరకుండా శుభ్రంగా ఉంచుకోవడం వంటి చిన్న, చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. 15 రోజుల్లో ఆస్పత్రికి సుమారుగా ప్రతిరోజు 1300 నుంచి 1500ల మంది అవుట్ పేషెంట్లు నమోదవుతుండగా వీరిలో 960 మందికి డెంగీ పరీక్ష నిర్వహించామని అందులో 161 మంది డెంగీ పాజిటివ్‌గా నమోదయ్యారని పేర్కొన్నారు. శుక్ర, శనివారల్లోనే 53 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారందరికీ తగిన చికిత్సలు చేస్తున్నామని, ఎవరికి ప్రాణహాని లేదన్నారు. ఆస్పత్రిలో ప్లేట్లేట్‌కి సంబంధించిన విలువైన యంత్రాలు ఉన్నాయని తెలిపారు. 15 రోజుల్లో 8 మంది ప్రాణపాయ స్థితిలో ఉండగా ఐసీయూలో చికిత్స అందించి వారిని కోలుకునేలా చేశామని తెలిపారు. అనవసరంగా ప్రయివేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్లేట్లేట్స్ తగ్గాయని ఆందోళన చెందకండని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిరంతరం డెంగీ కేసులను చూస్తున్నామని, ఆదివారం కూడా ఓపీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాంమోహన్, డీఎంఅండ్‌హెచ్‌ఓ రజిని, ప్రోగ్రామ్ ఆఫీసర్ జెరీనా, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
కోరలు చాస్తున్న డెంగీ..!
సాక్షి, విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి కోరలు చాస్తోంది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ జ్వరాల వ్యాప్తి కూడా అధికంగానే ఉంది. అయితే మలేరియా వ్యాధి వ్యాప్తి మాత్రం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా మలేరియా వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతంలో వ్యాప్తి తగ్గడం గమనార్హం. మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన ముందుస్తు చర్యలు వల్ల ఈఏడాది మలేరియా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. సీజనల్ వ్యాధులు వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంత ప్రజలు మలేరియా బారిన పడి మృత్యువాత పడేవారు. అయితే డెంగీ రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు నమోదైన రోగుల వివరాలు.. వ్యాధిపేరు రోగుల సంఖ్య జ్వరాలు 2,30,527 మలేరియా 60 డెంగీ 97 టైపాయిడ్ 820 డయేరియా 17,382 స్వైన్‌ఫ్లూ 20 కిటకిటలాడుతున్న ఆస్పత్రులు.. డెంగీ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ నాటికి 2లక్షల 30 వేలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ఆస్పత్రుల్లో రెండు లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. దోమల నివారణ మందు పిచికారీ.. గిరిజన ప్రాంతంలో ముందుస్తుగానే ఈ ఏడాది దోమల నివారణ మందు పిచికారీ చేశారు. అదేవిధంగా డెంగీ వ్యాప్తి ప్రాంతాల్లో 8 వారాల పాటు మలాథియాన్ పిచికారీ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన డెంగీ రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వదలని డెంగీ జ్వరాలు.. మెంటాడ: మండలంలోని వానిజ, గుర్ల, తమ్మిరాజుపేట గ్రామాల్లో డెంగీ జ్వరాలు ప్రబలాయి. చల్లపేట గ్రామానికి చెందిన సిరిపురపు అప్పలకొండ (40) డెంగీ లక్షణాలతో జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పలకొండ తన భర్తతో కలిసి రాజమండ్రి పనుల కోసం వలస వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చింది. మొదట జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న చికిత్స పొందింది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను గజపతినగం తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి డెంగీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో చల్లపేట వాసులు ఆందోళన చెందుతున్నారు. -
పల్లెల్లో డేంజర్ బెల్స్
సాక్షి కాకినాడ(తూర్పుగోదావరి) : జిల్లాలోని గ్రామాల్లో డెంగీ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామంలో 19 మందికి డెంగీ సోకడంతో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా కాకినాడ రూరల్ పండూరు, కరప, తూరంగి, శంఖవరం, ఏలేశ్వరం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ అర్బన్లతోపాటు పిఠాపురం, తుని, ముమ్మిడివరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, తదితర మండలాల్లో విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. జగ్గంపేట మండలంలో ముగ్గురు వ్యక్తులు డెంగీ బారిన పడితే అందులో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, శంఖవరం, ఏలేశ్వరం ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అత్యధిక సంఖ్యలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 103 డెంగీ కేసులు అధికారికంగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల్లోకి రాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. పారిశుద్ధ్యం అధ్వానం జిల్లాలో జ్వరాల తీవ్రతకు పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ దోమలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందడం లేదు. ఏటా జ్వరాలు పెరుగుతున్నా, మరణాలు నమోదవుతున్నా, పారిశుద్ధ్యం మెరుగుదలకు, తాగునీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. అయినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ వీటిని తగిన రీతిలో వినియోగించడం లేదు. జ్వరాల తీవ్రతను తగ్గించాలంటే గ్రామ, పట్టణ, నగరాల్లో జ్వరాల పట్ల చైతన్యం కల్పించడం, మరింత మెరుగుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడమే మార్గమని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. వివిధ జ్వరాల లక్షణాలివీ.. మలేరియా : విపరీతమైన చలి, చెమట, తల పట్టేయడం, వాంతులతో కూడిన జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైరల్ జ్వరం : జలుబు, దగ్గుతో పాటు జ్వరం వస్తే వైరల్ ఫీవర్‌గా అనుమానించాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి నోరు, ముక్కుకు రుమాలు పెట్టుకోవాలి. లేకుంటే ఈ వైరస్ సులభంగా మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. టైఫాయిడ్ : ఒక్కసారిగా 100 నుంచి 102 డిగ్రీల జ్వరం రావడం, మళ్లీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా రోజుకు నాలుగైదుసార్లు ఉంటుంది. వారం రోజుల పాటు ఇలాగే ఉంటే టైఫాయిడ్‌గా భావించాలి. రక్తపరీక్ష ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కలుషిత నీరు, ఫంగస్ వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుంది. చికున్ గున్యా : తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చి, కొద్ది రోజులుండి మళ్లీ తిరగబెడితే చికున్ గున్యా జ్వరంగా భావించాలి. ఒకసారి ఈ జ్వరం బారిన పడితే నీరసం, నొప్పుల నుంచి తేరుకునేందుకు చాలా కాలం పడుతుంది. 103 నుంచి 104 డిగ్రీల జ్వరం ఒక్కసారిగా వస్తుంది. శరీరంలోని అన్ని కీళ్లల్లో నొప్పులు ఆరంభమై కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లు, చేతులు వాపులు వస్తాయి. దోమకాటు వల్లనే ఇది వ్యాప్తి చెందుతుంది. డెంగీ : హఠాత్తుగా జ్వరంతో పాటు కాళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తే డెంగీగా అనుమానించాలి. జ్వరం వచ్చిన రెండో రోజు నుంచి వెన్నెముక నొప్పి, కనుబొమ్మల వాపు, వాంతులు, నీరసం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు వస్తాయి. వారం రోజుల పాటు అలాగే ఉంటే రక్తంలో ప్లేట్లెట్స్ శాతం పడిపోతుంది. ఒకసారి వచ్చిన జ్వరం పది రోజుల్లోగా మళ్లీ తిరగబెడుతుంది. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన ఈ వ్యాధి తీవ్రస్థాయి లక్షణాలు. వ్యాధి నిర్ధారణ కేవలం ఎలీసా (ఐజీజీ, ఐసీఎం) విధానంలో చేస్తారు. ఇది కేవలం దోమ కారణంగానే వ్యాప్తి చెందుతుంది. పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఉండాలి. ప్లేట్లెట్లకు కొరత డెంగీ సోకిన వారి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గితే వారికి వైద్యులు నిత్యం చికిత్స చేయాలి. 30, 40 వేలకు తగ్గినట్లయితే ఈ కణాలను దాతల నుంచి సేకరించి రోగుల శరీరంలోకి ఎక్కించాల్సి ఉంది. దీంతో ప్లేట్లెట్లు అవసరమైన వారు రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడలో రెడ్‌క్రాస్, రోటరీ బ్లడ్ బ్యాంకులు కొంత ఆదుకుంటున్నా బాధితుల సంఖ్యకు తగినట్టుగా వీటిని అందివ్వడం వీటికి కష్టతరంగా మారుతోంది. కాకినాడ జీజీహెచ్ తదితర ప్రాంతాలకు వైద్య నిమిత్తం వస్తున్న వ్యాధిగ్రస్తులు, వ్యాధి సోకిన వారి బంధువులు రక్తనిధి కేంద్రాలకు వెళ్లి ప్లేట్లెట్లు దొరకక నిరాశ చెందుతున్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగీ జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే రోగుల సంఖ్య మరింత పెరిగి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు అంతా విషజ్వరాల బారినపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో విషజ్వరాలతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రం.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 6,210 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో 123 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా బారిన పడి నలుగురు మృతి చెందారు. మరో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల విషజ్వరాల తో 11 మంది, డెంగీతో మరో ఇద్దరు మృతి చెందా రు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి పరీక్షలు చేసుకున్న వారిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 28 డెంగీ కేసు లు, 27 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోనూ డెంగీ లక్షణాలతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించడంతో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక రోగులను వెనక్కి పంపేస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోతే.. డెంగీ మరణాలతో జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జిల్లాల్లో వందలాది మంది రోగులు డెంగీ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా మృత్యువాత పడ్డారు. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేరిట వేల రూపాయలు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ కేంద్రాల్లో వైద్యుల కొరతతో రోగులు తప్పనిసరై ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనికి వర్షం తోడు కావటంతో రోగాలు ప్రబలుతున్నాయి. అధికారికంగా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గత గణాంకాల్లోకి వెళ్తే.. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దేశ వ్యాప్తంగా 78,691 డెంగీ కేసులు నమోదు కాగా.. 122 మంది చనిపోయినట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. 2016లో 1,29,166 కేసులు నమోదైతే 245 మంది చనిపోయారు. మలేరియా కేసులు గత నెల వరకు 4,10,141 నమోదు కాగా, సాధారణ మలేరియా కేసులు 5,92,905 రికార్డయ్యాయి. 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015లో 99,913 డెంగీ కేసులు నమోదుకాగా.. 220 మంది మృతి చెందారు. 2013లో 75,808 డెంగీ కేసులు నమోదు కాగా.. 192 మంది చనిపోయారు. 2011 కంటే 2012లో ఏకంగా 50,222 మందికి డెంగీ సోకగా 242 మంది మృత్యువాతపడ్డారు. 2010లో 28,292 డెంగీ కేసులు నమోదుకాగా.. 110 మంది మృతి చెందారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు ఎక్కువగా సోకే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. -
పాతర్లపల్లికి జ్వరమొచ్చింది..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): అదో మారుమూల గ్రామం. అక్కడ సుమారు 450 కుటుంబాలు, 1,500 మంది జనాభా ఉంటారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు 200 మంది తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. 20 రోజులుగా గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయి. జ్వరాల బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే నలుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు డెంగీ లక్షణాలతో చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమకు కూడా జ్వరాలు ఎక్కడ వస్తాయోనన్న భయంతో అనేకమంది గ్రామస్తులు ఊరునే ఖాళీ చేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని పాతర్లపల్లిలో ఊరుఊరంతా విషజ్వరాలతో అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పరిశుభ్రత లోపించింది. చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికికాలువల్లో దోమల లార్వా పెరిగిపోయింది. దీనికితోడు భారీగా కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో నలుగురి దుర్మరణం గ్రామంలో కొద్దిరోజులుగా 200 మందికి పైగా తీవ్రమైన విషజ్వరాలతో బాధపడుతున్నారు. పదిహేను రోజుల క్రితం గ్రామానికి చెందిన రామ్ లచ్చమ్మ, కోడారి రాజవీరు, బాలమ్మ చనిపోయారు. తాజాగా అనుమండ్ల లక్ష్మి అనే మహిళకు విçషజ్వరం రావడంతో ఆమెను కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు డెంగీగా నిర్ధారించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆదివారం చనిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఉదయం నుంచే వరంగల్, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల బాటపట్టారు. జమ్మికుంటలోని ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చూసినా పాతర్లపల్లికి చెందిన వారే కనిపిస్తున్నారు. కొందరు కరీంనగర్, హన్మకొండలలో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకుం టున్నారు. వైద్యాధికారులు నామమాత్రంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెళ్లిపోయారని, మురికికాలువల్లో మందు చల్లి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గ్రామస్తుల రక్తనమూనాలు సేకరించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆరా.. విషజ్వరాలపై ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఈ జిల్లాకు ఏమైంది?
చిన్నపాటి జ్వరం వచ్చినా భయపడే పరిస్థితి వచ్చింది. ఇదేంటి... అనుకుంటున్నారా? అవునండీ బాబు. పిట్టల్లా రాలిపోతున్నారు జనం. చికిత్స ఓవైపు సాగుతుండగానే... క్షణాల్లో ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని రక్తపరీక్షల్లో నిర్థారణ అవుతోంది. అది డెంగీకావచ్చని ఓ వైపు ప్రైవేటు వైద్యులు చెబుతున్నా... అబ్బే అదేం కాదని తేల్చేస్తున్నారు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు. ఏదేమైనా ప్రాణాలు కోల్పోయేది జనాలే కదా. రోజూ ఎక్కడో ఓచోట జ్వరాలతో మృతి చెందుతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గడచిన పదిహేను రోజుల్లో ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారు 15మంది ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో స్పష్టమవుతోంది కదా.... సాక్షిప్రతినిధి, విజయనగరం : ‘స్వచ్ఛభారత్ కాయకల్ప అవార్డులు అందుకున్నాం. సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా ప్రకటించుకున్నాం. నీతిఅయోగ్ ఎంపిక చేసిన 117 వెనుకబడిన యాస్పిరేషన్ జిల్లాల్లో మన రాష్ట్రం నుంచి మూడు జిల్లాలుంటే వాటిలో ఒకటి మన జిల్లా కాగా 117 జిల్లాలతో పోటీపడి నాలుగవ స్థానంలోనూ, కృషి కల్యాణ్ అభియాన్‌లో మొదటి స్థానంలోనూ నిలిచాం.’’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ దోమలు స్వైర విహారం చేస్తూ, వ్యాధులు విజృంభిస్తుంటే నష్ట నివారణ చర్యలు మానేసి కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెదుకుతున్నాం. ప్రజలపై ఒకవైపు డెంగీ, మరోవైపు విషజ్వరాలు పంజా విసిరి ప్రాణాలు తీస్తుంటే సదస్సులు, సమీక్షలంటూ కాలం వెళ్లదీస్తున్నాం. ఒక్కరేనట! 2018 జనవరి నెల నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 2,08,368 మందికి జ్వరాలు సోకినట్టు నమోదయ్యాయి. ఇందులో 91,362 కేసులు గిరిజన ప్రాంతాల్లోనివే. ప్రైౖవేటు ఆస్పత్రుల్లో 2.50 లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. తాజాగా డెంగీ, విషజ్వరాల బారిన పడి జిల్లాలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. డెంగీతో రోగులు చచ్చి పోతున్నా వైద్య ఆరోగ్యశాఖ మా త్రం అవి డెంగీ మరణాలు కాదంటూ బుకాయిస్తోంది. ఇప్పటి వరకూ గరివిడి మండలం బొండపల్లికి చెందిన జానకి ఒక్కరే డెంగీతో మరణిం చారని అధికారులు చెబుతున్నారు. అధికార లెక్కల ప్రకారం 36 కేసులు: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం డెంకాడ మం డలంలో 1, డెంకాడలో 7, విజయనగరం మండలంలో 3, అర్బన్‌లో 4, తెర్లాంలో 1, జామిలో 2, నెల్లిమర్లలో 2, భోగాపురంలో 2, దత్తిరాజేరులో 2, బాడంగిలో 1, గుర్లలో 2, గజపతినగరంలో 2, ఎస్.కోటలో 1, మెంటాడ లో 1, చీపురుపల్లిలో 1, బొబ్బిలిలో 1, గంట్యాడలో 1, మక్కువలో 1, పూసపాటిరేగలో 1 చొప్పున 36 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని అంచనా. చాలా మంది రోగులు నేరుగా విశాఖ పట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్(కేజీహెచ్), ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు ఇక్కడ నమోదు కావడం లేదు. విశాఖ ఆస్పత్రుల్లో వై ద్యం చేయించడానికి ఒక్కక్కరికీ రూ.70వేల నుం చి రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. డెంగీ అనంగానే రిఫర్ జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉంది. 68 పీహెచ్‌సీలకు 103 మంది వైద్యులకు 48 మంది రెగ్యుల ర్ వైద్యులున్నారు. 35 మంది కాంట్రాక్టు వైద్యులున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా డెంగీ అని నిర్ధారణ కాగానే వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేసేస్తున్నారు. నిజానికి డెంగీకి ప్రత్యేకంగా చికిత్స అందించాల్సిన పని ఉండదు. సాధారణ జ్వరం మాదిరిగానే చేస్తే సరిపోతుంది. అయి తే ప్లేట్ లెట్స్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతే వా టిని ఎక్కించాల్సి ఉంటుంది. నెలరోజుల్లో నమోదైన డెంగీ, జ్వర మరణాలు తాజాగా బుధవారం ఎస్.కోటకు చెందిన సునా య కుమారి(45) డెంగీతో మత్యువాత పడింది. విజయనగరం రూరల్ మండలం మలిచర్లలో తుమ్మగంటి ఆశ(10) ఈ నెల15న డెంగీ జ్వరంతో కన్నుమూసింది. అదే రోజు ఎస్‌కోట పట్టణం ఎరుకులపేటలో సునాయ కుమారి(45) కూడా చనిపోయింది. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన ఒలుగింటి జానకి అనే గర్భిణి డెంగీ జ్వరంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రసవించి మృతి చెందింది. ఈ నెల 13న జరిగిన ఈ సంఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది.గుర్ల మండలం గరిడకు చెందిన గులివిందల అప్పల నాయుడు(45) డెంగీ జ్వరంతో ఈ నెల 12న మరణించాడు.ఎస్.కోట పుణ్యగిరి రోడ్డులో నివాసమున్న వివాహిత బత్తిన సూరీడమ్మ(38)జ్వరంతో ఈ నెల 10న మృతిచెందింది. లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామానికి చెందిన గొల్ల రాము(24) జ్వరంతో బాదపడుతూ ఈ నెల 9న మృతి చెందాడు. కొమరాడ మండలం దళాయిపేటలో రాగల గౌరమ్మ (45) ఈ నెల 9న మృతిచెందింది. ఇదే మండలంలోని విక్రంపురంలో రౌతు ధనుష్(3) జ్వరంతో బాధపడుతూ కన్నుమూశాడు. ఎస్.కోట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన చిన్నారి చిప్పాడ మౌనిష(4) డెంగీ జ్వరంతో ఈ నెల 6వ తేదీన చనిపోయింది. ఉసిరి గ్రామానికి చెందిన బొబ్బిలి రమణమ్మ(32) డెంగీ జ్వరంతో చనిపోయిందని కుటుం బీకులు చెబుతున్నారు. చీపురుపల్లి మండలంలోని పికె.పాలవలస పంచాయతీ మధుర గ్రామమైన చిలకరాళ్లబడిలో కొండపల్లి కుసుమ(6) డెంగీ జ్వరంతో మృతి చెందింది. ∙జామి మండలం ఎం.కె.వలస పంచాయతీ బలరాంపురం గ్రామానికి చెందిన జలగడుగుల కల్యాణి డెంగీ లక్షణాలతో జూలై 31వ తేదీన కన్నుమూసింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం జిల్లాలో సంభవిస్తున్న మరణాలన్నీ డెంగీ జ్వరా లుగా భావించడానికి వీల్లేదు. ఇప్పటి వరకూ ఒక్కరే ఆ వ్యాధితో మృతి చెందినట్లు నిర్థారించాం. జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందుతున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వైద్య సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని ఆదేశించాం. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొబైల్ డెంగీ, మలేరియా అవగాహన వాహనాలే గాకుండా అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేశాం. దోమలు వృద్ధి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. – కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి -
దడ.. దడ!
డెంగీ.. ఈ వ్యాధి పేరు వింటేనే దడ పుడుతుంది.. ఇప్పటికే జిల్లాలో రెగ్యులర్ కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నారు. ఫలితంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఇలా వచ్చే వారిలో పలువురికి డెంగీ సోకినట్లు నిర్ధారణ అవుతుండడం గమనార్హం. అలాగే, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా కూడా పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో బెడ్లు సరిపోక కిందే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. పాలమూరు: సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతూ సమీక్షలు నిర్వహిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో తప్పించి ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా డెంగీ వ్యాధి నిర్ధరణ పరికరాలు లేవు. దీంతో బాధితులు కొంత వరకు జనరల్ ఆస్పత్రికి వస్తున్నా.. మిగతా హైదరాబాద్ వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు కార్పొరేట్ హంగులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్లేట్లెట్ల కిట్లు, వాటికి సంబంధించిన యంత్రాలు ప్రాంతీయ ఆస్పత్రులకు ఇంకా చేరలేదు. 40 కేసుల్లో 4 పాటిజివ్ జిల్లా జనరల్ ఆస్పత్రికి ప్రతి రోజు డెంగీ పరీక్షలు చేయించుకోవడానికి 40 మందికి పైగా వస్తుండగా ఇందులో నాలుగు నుంచి ఆరు మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అవుతోంది. ఆగస్టు నుంచి అక్టోబర్ 16వరకు 1,492 మందికి పరీక్షలు చేయగా.. ఇందులో 113మందికి రికార్డు స్థాయిలో పాజిటివ్ నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం రావాల్సి ఉన్నా రాలేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కన్పించడం లేదు. ఏ గ్రామంలో కూడా ఇప్పటివరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కానీ, అవసరమైన మందులు పంపిణీ చేసిన దాఖలాలు కానీ లేవు. వ్యాధి లక్షణాలు ఈడిన్ ఈజిప్టే అనే రకం దోమ కుట్టడం వల్ల డెండీ సోకుతుంది. ఇది కుట్టిన 7–8రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కన్పిస్తాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావటం, కళ్లు కదలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. భరించలేని కండరాల నొ ప్పి, వాంతులు, వికారం రక్తం తో కూడిన మల విసర్జన, కడుపు నొప్పి ఉంటాయి. రక్తపోటుతో పాటు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అన్ని అవయవాలు విఫలమైన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదమున్నందున లక్షణాలను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టడం సాధ్యమవుతుంది. నివారణ చర్యలు చేపట్టాం జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రతీ శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తున్నాం. డెంగీ కేసులు నమోదవుతున్న గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇక మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారికి ఇక్కడ పరీక్షలు చేయిస్తున్నాం. – డాక్టర్ రజిని, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
‘ఉపాధి హామీ’ని నీరుగార్చే యత్నాలు: చాడ
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిధుల కొరతతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ చట్టాన్ని బలోపేతం చేసి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ర్ట సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై హింస పెరుగుతున్నా, ఈ ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా, ఈ ఏడాది 1,983 కేసులు నమోదైనా, నివారించడంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉస్తేల సృజన, ఎన్.జ్యోతి, ఎం.నళిని, ఎస్.ఛాయాదేవి, సదాలక్ష్మి పాల్గొన్నారు. -
డెంగీతో చనిపోతున్నా చలనం లేదా?
ఖమ్మం: డెంగీ జ్వరాలతో ప్రజలు చనిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం చలనం లేకుండా వ్యవహరిస్తోందని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 21మంది డెంగీతో మృతిచెందినా మంత్రులకు వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, చికిత్సకు అయిన ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. డెంగీ జ్వరాలు అదుపులోకి వచ్చేదాకా సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. -
వణికిస్తున్న విష జ్వరం
– పశ్చిమాన పెరుగుతున్న కేసులు – నిద్దరోతున్న వైద్యశాఖ – ‘పారిశుధ్యం’పై సమన్వయ లోపం – మృత్యువాత పడుతున్న చిన్నారులు ఓ పక్క ఎండలు అదరగొడుతుంటే.. మరోవైపు వదిలీ వదిలీ పడుతున్న వర్షాలు ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. బాధితుల్లో పదేళ్లలోపు పిల్లలే ఎక్కువమంది ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. ‘‘ బి.కొత్తకోట బీరంగి పంచాయతీలో మూడేళ్ల వయస్సున్న అరుణ అనే చిన్నారి శనివారం జ్వరంతో మృతి చెందింది. డెంగీ జ్వరమే ఇందుకు కారణమని వైద్యులు నిర్ధారించారు.’’ ‘‘ రామసముద్రం మండలంలోని మూగవాడి గొళ్లపల్లెకు చెందిన కార్తిక్ (16) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం జ్వరం ఎక్కువకావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు.’’ ..ఈ రెండే కాదు పడమటి మండలాల్లో గత నెల రోజుల్లో 360 జ్వరా బాధిత కేసులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. విజృంభిస్తున్న విష జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. చిత్తూరు (అర్బన్): వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల మధ్య కొరవడిన సమన్వయం జనం ప్రాణాలపైకి తెస్తోంది. జ్వరాలపై గత ఏడాది జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మేల్కొనేలోపు చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తగ్గడం లేదే..! జిల్లాలో జూన్‌లో తేలికపాలి వర్షాలు పడ్డాయి. ఈనెలలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 985 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 13 డెంగీ కేసులు ఉన్నాయి. జూలై నెలలో 759 కేసులు నమోదవగా 11 డెంగీ కేసులు, గత నెల 892 జ్వరం కేసుల్లో 8 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఈనెల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 489 మంది జ్వరాలతో ఆసుపత్రులకు వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. రానున్న మాసాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. జ్వర బాధితుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప.. తగ్గేలా కనిపించడంలేదు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ జ్వరాలతో బాధపడుతున్న వాళ్లు, మృత్యువాత పడుతున్న వాళ్లల్లో చాలామంది జిల్లాలోని పడమటి మండలాలకు చెందిన వాళ్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు మండలాలతో పోలిస్తే పశ్చిమాన వాతావరణం కాస్త చల్లగా ఉండటానికి తోడు చిన్నపాటి వర్షాలు పడితే పరిసరాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. మురుగునీరు ప్రవహించడానికి సరైన కాలువ వ్యవస్థ లేకపోవడం, గ్రామాల్లో ఇళ్ల మధ్యే మురుగునీళ్లు నిలిచిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. ప్రధానంగా పలమనేరు, వి.కోట, పుంగనూరు, మదనపల్లె, మొలకలచెరువు, బి.కొత్తకోట, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం ప్రాంతాల వైపు జ్వరాలతో బాధపడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. సమన్వయం ఏదీ? పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సరిగా జరగడంలేదు. పారిశుధ్యం నిర్వహణ మొత్తం పంచాయతీ శాఖ చూస్తున్నా.. పనులు ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. గతంలో ప్రతీ నెలా ఓ గ్రామంలో సామూహిక పారిశుధ్య పనులు నిర్వహిస్తుండటంతో పరిస్థితి కాస్త గాడిన పడేది. కానీ ఈ ఏడాది సీజనల్ జ్వరాలు వణికిస్తున్నా పంచాయతీశాఖను నిద్రలేపలేకపోతోంది. గ్రామాల్లో ఉన్న నీటి నిల్వ కేంద్రాలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు దోమలకు పుట్టినిల్లుగా తయారైంది. నెలలో రెండు సార్లు వీటిని శుభ్రం చేయాలని నిబంధనలు చెబుతున్నా పట్టించుకునే దిక్కులేదు. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత వైద్యారోగ్యశాఖ అధికారులు మేల్కొంటున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి ముందస్తుగా ప్రజల్ని చైతన్యం చేసి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడాల్సిందిపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన జ్వరాలు విభృంభించిన తరువాత వైద్యశిబిరాలు పెట్టడం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదనేది అందరికీ తెలిసిన సత్యం. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల మధ్య భేదాభిప్రాయాల వల్ల పల్లెల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా తయారైంది. గత పాఠాలు మరిచారా..? రాష్ట్ర చరిత్రలోనే జిల్లాలో గతేడాది ఎక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. 2012లో 329 డెంగీ కేసులు నమోదవడం ఓ సంచలనం.అయితే గత చరిత్రను తుడిచిపెడుతూ 2015లో ఏకంగా 1245 డెంగీ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. మూడేళ్ల కాలంలో ఈ సంఖ్య నాలుగంకెలకు చేరడం అధికారులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక డెంగీ జ్వరాలతో గత ఏడాది జిల్లాలో చనిపోయిన వాళ్ల సంఖ్య 44. ఢిల్లీ నుంచి జాతీయ వైద్యృబందం రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి యువకులు,ృÐlద్దులు ఇలా చాలా మంది ప్రాణాలు గాల్లో కలిపిపోయాయి. విష జ్వరాలు సోకిన వాళ్లకు సకాలంలో డెంగీ, ఇతర పరీక్షలు చేయడంతో ఆలస్యం నెలకొనడం, కొన్ని చోట్ల సాధారణ జ్వరం గుర్తించడానికి అవలంభించే విధానాన్నే విష జ్వరాలను కనిపెట్టడంలో అన్వయించడం వల్ల చివర్లో ప్రాణాంతక జ్వరాలని గుర్తించడం వల్ల ప్రజలు తల్లడిల్లిపోయారు. దీనికి తోడు 135 మలేరియా కేసులు, 45 చికున్ గున్యా కేసులు సైతం నమోదయ్యాయి. గతం నేర్పిన పాఠాలనుృ§lష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాల్సిన యంత్రాంగం ఇంకా మొద్దునిద్దరలో ఉండటం శోచనీయమే. నిధులు ఉపయెగించుకోండి... పారిశుద్ద్య పనులు మెరుగు పరచడానికి ఇప్పటికే 14వ ఆర్థిక సంఘ నిధులను అన్ని గ్రామాలకు పంపిణీ చేశాము. వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. కార్యదర్శులు, సర్పంచ్‌లు ఇందుకు చొరవ చూపాలి. ఇప్పటికే విష జ్వరాలపై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాం. విష జ్వరాలు, డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ద్య పనులు చేపడుతున్నాం. – కె.ల్.ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి. నేటి నుంచి మొబైల్ క్లీనిక్స్... సీజనల్ వ్యాధుల నుంచి ప్రజల్ని చైతన్యం చేసి అప్రమత్తం చేయడానికి నేటి నుంచే కొత్త ప్రణాళికను అమల్లోకి తెస్తున్నాం. మొబైల్ మలేరియా క్లీనిక్స్ పేరిట ఓ చైతన్య రథంలో మా సిబ్బంది ప్రతీ మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దోమల వ్యాప్తి నివారణ, లార్వాల గుర్తింపు, డ్రైడే, పారిశుద్ద్య నిర్వహణ ఇలా అన్నింటిపై ప్రణాళిక రూపొందించాం. కచ్చితంగా గతేదికన్నా ఈ సారి జ్వరాల సంఖ్యను తగ్గిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా వైద్యాధికారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. – డాక్టర్ జె.లావణ్య, జిల్లా మలేరియా అధికారి. -
'డెంగీ చికిత్సకు ఆయుర్వేదం మందులిస్తా'
-
'డెంగీ చికిత్సకు ఆయుర్వేదం మందులిస్తా'
- డెంగీ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం - డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలి: బాబా రాందేవ్ న్యూఢిల్లీ: డెంగీ జ్వరాల బారినపడి దేశంలో చాలామంది మరణించారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. డెంగీ మరణాలపై స్పందించిన ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల డెంగీ జ్వరాలతో 15మంది మృత్యువాత పడ్డారని మండిపడ్డారు. డెంగీని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డెంగీని ఆయుర్వేద పద్ధతిలో నివారిస్తామని స్పష్టం చేశారు. డెంగీ పేషెంట్లకు తిప్పతీగ, అలోవీరాల రసం తప్పకుండా ఇవ్వాలని బాబా రాందేవ్ సూచించారు. -
స్వైన్‌ఫ్లూకు ‘ప్రైవేట్’లో ఉచిత సేవలు
* ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వాలని సర్కారు నిర్ణయం * అనుమానితులకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరే రోగులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ అనుమానితులకు రక్తపరీక్షలు చేసే వరకు ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. ‘స్వైన్‌ఫ్లూ పరీక్షలను తప్పనిసరిగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లోనే చేయించాలి. ఈ పరీక్షలన్నింటినీ ఉచితంగానే నిర్వహిస్తారు. అవసరమైన మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నందున కార్పొరేట్ ఆసుపత్రులు ఉచితంగా ఇవ్వాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది స్వైన్‌ఫ్లూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు నిలువు దోపిడీ చేయడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్వైన్ ఫ్లూ పరీక్ష చేయాలంటే రూ. 3,500 ఖర్చు అవుతుండడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఐపీఎంలో పరీక్ష చేసినట్లుగా ఇచ్చిన పత్రాలను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందజేసి స్వైన్‌ఫ్లూ బాధితులు ఉచిత వైద్యం పొందవచ్చని సూచించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ఇతరత్రా వైద్య చికిత్సలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారాలు, సెలవుల్లోనూ ఐపీఎంలో పరీక్షలు ఐపీఎంను ఆదివారాలు, సెలవుల్లోనూ ఒకపూట తెరిచి ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. స్వైన్‌ఫ్లూ బాధితులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 25 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని వివరించారు. స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరపీడితులు జనసమ్మర్థంలోకి రాకూడదని, కరచాలనం చేయొద్దని, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. రామంతాపూర్‌లోని హోమియో ఆసుపత్రిలోనూ హోమియో మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయన్నారు. -
దివిసీమను వణికిస్తున్న డెంగీ
చల్లపల్లి : దివిసీమను ప్రజలను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. మూడు నెలల క్రితం చల్లపల్లి మండలం కొత్తమాజేరులో బయట పడిన ఈ జ్వరాలు, ఇటీవల మోపిదేవి, నాగాయలంక మండలం గణపేశ్వరానికి విస్తరించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ డెంగీ కేసులు లేవని చెప్పడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న వైద్య, ఆరోగ్యశాఖాధికారులు వీటిని డెంగీ కేసులుగా గుర్తించడం లేదు. వణకుతున్న ప్రజలు చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మూడు నెలల క్రితం డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామంలో సుమారు 50 మందికి డెంగీ జ్వరాలు వ్యాపించాయి. డెంగీ, విషజ్వరాల వల్ల మొత్తం 20 మంది చనిపోయారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కొత్తమాజేరు పర్యటన, మచిలీపట్నంలో ధర్నాతో కంగుతిన్న రాష్ట్ర మంత్రులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని చెప్పుకొచ్చారు. డెంగీ, విషజ్వరాలు లేనపుడు రెండు నెలల నుంచి ఈగ్రామంలో వైద్యశిబిరం ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, గ్రామస్తుల ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఇప్పటికీ ఈ గ్రామంలో విషజ్వరాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాసేస్తున్నారు స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని దివిసీమలో డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖాధికారులు డెంగీ కేసులను దాసేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేరే గ్రామాలకు చెందిన కొంతమంది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో డెంగీ జ్వరాలతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మంత్రులు స్పందించి బేషజాలకు పోకుండా డెంగీ జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విస్తరిస్తున్న డెంగీ నాలుగు రోజుల క్రితం మోపిదేవి పంచాయతీ పరిధిలోని వికలాంగుల కాలనీలో నడకుదిటి కృష్ణకుమారి (45) మరణించిన విషయం విదితమే. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరానికి డెంగీ జ్వరాలు విస్తరించాయి. గ్రామంలో సర్పంచ్ దాసి జీవరత్నం, మరో విద్యార్థిని దాసి మంజూషతోపాటు కూతాటి రంగారావు, చాట్రగడ్డ దానియేల్‌కు డెంగీ జ్వరాలు ఉన్నట్టు వైద్యపరీక్షలో తేలింది. దీంతో గ్రామస్తులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దివిసీమలో డెంగీ జ్వరాలు విస్తరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
విజృంభిస్తున్న మలేరియా, డెంగీ జ్వరాలు
జనవరి నుంచి ఇప్పటివరకు 1,281 కేసులు నమోదు * ఈ వారంలోనే 36 డెంగీ కేసుల నిర్ధారణ * ఇతర జ్వరాలు నాలుగున్నర లక్షలు పైనే నమోదు * కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనం జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వాటితో బెంబేలెత్తుతున్నారు. అలాగే టైఫాయిడ్, అతిసార, కామెర్లు వంటివీ ప్రజలను కలవరపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,210 మంది మలేరియా బారిన పడితే... డెంగీతో 71 మంది, చికున్ గున్యాతో 26 మంది బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కించింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 36 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 13 కేసులు హైదరాబాద్‌లోనే రికార్డు కావడం గమనార్హం. ఇవేకాకుండా ఈ ఏడాది 4.5 లక్షల మంది ఇతర రకాల జ్వరాల బారిన పడినట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. అందులో జూన్, జూలై నెలల్లోనే ఏకంగా 2 లక్షల మందికి జ్వరాలు వచ్చినట్లు నమోదైంది. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడం... పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణ, పల్లె ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రమైన దుస్థితికి వెళ్లడంతో పరిస్థితి ఘోరంగా మారింది. హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్ గిరిజన పల్లెల వరకూ వ్యాధుల తీవ్రత మరింత పెరిగింది. మూడు జిల్లాల్లో అత్యధిక కేసులు... గిరిజన ప్రాంతాలున్న ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 647 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 186, వరంగల్ జిల్లాలో 139 కేసులు రికార్డు అయ్యాయి. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని గిరిజన పల్లెలు మలేరియా సహా ఇతర జ్వరాలతో వణికిపోతున్నాయి. తెలంగాణలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 870, వరంగల్‌లో 110, మహబూబ్‌నగర్‌లో 20 గ్రామాలున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విషజ్వరాల పరిస్థితి ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. మరోవైపు అత్యధికంగా హైదరాబాద్‌లో 85 వేల మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. అందులో ఎక్కువ జ్వరాలు జూన్, జూలై నెలల్లోనే నమోదైనట్లు చెబుతున్నారు. మెదక్ జిల్లాలోనూ 70 వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో రెండు నెలలపాటు వ్యాధుల సీజన్ ఉండటంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని అంటువ్యాధుల నివారణ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. మలేరియా నిర్ధారణ కిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైన మందులను సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు. -
డెంగీపై కలెక్టర్ సీరియస్
- డీఎంఅండ్‌హెచ్‌వోపై తీవ్ర ఆగ్రహం - హెల్ప్‌లైన్ సరిగాలేదని మండిపాటు - ఎంపీహెచ్‌ఈవో సస్పెన్షన్‌కు ఆదేశాలు చిత్తూరు (అర్బన్): జిల్లాలో డెంగీ జ్వరాలు.. మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండిపడ్డారు. డెంగీ జ్వరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సరిగా అమలు చేయలేదని మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో) కరుణాకరన్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో విష జ్వరాలు.. డెంగీ జ్వరాలు ప్రబలడంతో పలువురు చనిపోతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ ఆదివారం చిత్తూరులోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విష జ్వరాలు తీవ్రమవుతున్న తరుణంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు. దీనిపై డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ పశ్చిమ మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి, స్థానిక వైద్యులకు సూచనలు ఇచ్చానని చెప్పారు. ప్రజలకు జ్వరాలపై వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్ నెంబరు సైతం ఏర్పాటు చేశానని తెలిపారు. అప్పటికే హెల్ప్‌లైన్ నెంబరు పనిచేయడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో డీఎంఅండ్‌హెచ్‌వో ఎందుకు దీన్ని పర్యవేక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే శుభ్రం చేయించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ చెత్త తొలగింపుపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల్లో ఎన్ని జ్వరాల కేసులు నమోదయ్యాయని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు. ప్రతి రోజూ నమోదవుతున్న జ్వరాల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. దోమల నివారణకు వైద్యశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఎంపీహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రధానంగా మదనపల్లె, పీలేరు, పుంగనూరు మండలాల్లో విష జ్వరాలు ఎక్కువగా వస్తుండటంతో ఎంపీహెచ్ఏలు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పది రోజుల పాటు అక్కడ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటా తిరిగి జ్వరాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా మలేరియా విభాగం అధికారి దోసారెడ్డి, చిత్తూరు కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు పాల్గొన్నారు. కార్మికులు సమ్మె విరమించాలి... జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం వల్ల ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే పేరుకుపోయాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు విష జ్వరాలను కలుగచేస్తున్నాయన్నారు. వెంటనే విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకాకపోవడంపై చిత్తూరు ఇన్చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావుపై అసహనం వ్యక్తం చేశారు. వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. మునిసిపాలిటీల్లో అదనపు సిబ్బంది తీసుకోండి జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగు పడాలని కలెక్టర్ సిద్ధార్థ్థ్‌జైన్ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో వాళ్లను ఒప్పించి విధులకు హాజరయ్యేలా చూసే బాధ్యత ఆయా ఆర్డీవోలదేనన్నారు. సిబ్బంది అంగీకరించని పక్షంలో అదనపు సిబ్బందిని తెప్పించుకుని పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు. జ్వరాలపై అశ్రద ్ధ చేయకుండా గ్రామాల్లో వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక రుయా, స్విమ్స్, వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిల్లో ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేసి విషజ్వరాలతో వచ్చే జిల్లా వాసుల వివరాలు, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్చవేక్షించాలన్నారు. వసతి గృహాల్లో సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రిన్సిపాళ్లను వైద్యాధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు, మదనపల్లె సబ్ కలెక్టర్ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరి, డీపీవో ప్రభాకరరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
పీడిస్తున్న డెంగ్యూ
=గతేడాదితో పోలిస్తే పెరిగిన బాధితులు =493 మంది రక్తనమూనాల పరిశీలన =నిర్ధారిస్తున్న ఏఎంసీ గణాంకాలు విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్ : జిల్లాలో డెంగ్యూ జ్వరాల తీవ్రత గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు ఆంధ్రవైద్య కళాశాల(ఏఎంసీ) మైక్రో బయాలజీ విభాగం గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఈ ఏడాది ఎపిడమిక్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకూ మొత్తం 493 మంది జ్వర అనుమానితుల రక్తనమూనాలు ఈ విభాగానికి వచ్చాయి. ఇందులో 167 మందికి డెంగ్యూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. గత ఏడాది మొత్తం 163 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఐదు నెలలకే 167 కేసులు నమోదు కావడంతో ఈ ఏడాది పూర్తయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ జ్యోతి పద్మజ అభిప్రాయపడ్డారు. విశాఖ నగర పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది వరదలు, పారిశుద్ధ్య నిర్వహణ లోపాల వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. అదే స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అధికారికంగా నిర్ధారించనప్పటికీ మృతులు పది మందికి దాటే ఉంటారన్న వాదన వ్యక్తమవుతోంది. వైరల్ వ్యాధుల నిర్ధారణకు ఉపకరించే ఎలిసా పరీక్ష నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు, కిట్లు కేజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ జ్యోతి పద్మజ చెప్పారు. జ్వరం వచ్చిన కొద్ది రోజుల్లోనే వైరస్ నిర్ధారణకు చేసే ఐజీఎం యాంటీ బాడీస్ వైద్య పరీక్షను మాత్రమే ప్రస్తుతం చేస్తున్నామన్నారు. రోగి శరీరంలో గతంలో వైరస్ ఇన్ఫెక్షన్ను నిర్ధారించేందుకు చేసే ఐజీజీ యాంటీబాడీ పరీక్ష మాత్రం సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం చేయడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా వైరాలజీ ల్యాబ్ : వివిధ రకాల వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రేడ్-2 వైరాలజీ లేబొరేటరీని కేజీహెచ్‌లో నెలాఖరులోగా వినియోగంలోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ ల్యాబ్‌కు సం బంధించిన యంత్ర పరికరాలు దశలవారీగా వస్తున్నాయన్నారు. ఈ ల్యాబ్‌ను కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్ వార్డులోని పాత గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు మరో 20 రోజుల్లో పూర్తవుతాయని, నెలాఖరున ప్రారంభించే అవకాశముందన్నారు. దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎన్ఆర్) నిధులను సమకూర్చిందన్నారు. ఈ ల్యా బ్లో ఎలిసా పరీక్షతో పాటు పీసీఆర్, ఇన్యూనోఫ్లోరసెన్స్ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశముందన్నారు. మైక్రోబయాలజీ విభాగంలో ఉన్న ల్యాబరేటరీని గ్రేడ్-2 ల్యాబ్ పూర్తయితే అక్కడకు తరలిస్తామని చెప్పారు.