కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!! | Mysterious New Dengue Viral Fever Grips Pakistan Karachi | Sakshi
Sakshi News home page

Mysterious New Dengue Viral Fever: కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!!

Published Sat, Nov 13 2021 9:44 AM | Last Updated on Sat, Nov 13 2021 10:12 AM

Mysterious New Dengue Viral Fever Grips Pakistan Karachi - Sakshi

కరాచి: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇది డెంగ్యూ జ్వరం మాదిరిగానే రోగుల్లో ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాము డెంగ్యూ కోసం పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ అన్నారు.

(చదవండి: వావ్‌ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్‌ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!)

పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. అయితే ఈ వైరల్‌ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కానీ ఇది డెంగ్యూ జ్వరం కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో  తాజాగా 45  కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్‌లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

(చదవండి: నువ్వే స్టెప్‌ వేస్తే అదే స్టెప్‌ వేస్తా!!:వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement