బాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి ఫాంలో ఉన్న స్టార్ రణవీర్ సింగ్. డ్యాన్స్, ఫైట్స్, పర్ఫామెన్స్లలో బెస్ట్ అనిపించుకుంటున్న ఈ యువ కథానాయకుడికి చుక్కలు చూపించాడు యోగా గురువు బాబా రాందేవ్. ప్రస్తుతం బేఫికర్ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు టీవీ షోలకు హాజరువుతున్నారు రణవీర్ సింగ్, వాణీకపూర్. అందులో భాగంగా అజ్ తక్ ఛానల్లో ప్రసారం అవుతున్న 'ఎజెండా అజ్ తక్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో రణవీర్తో పాటు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు.