బాబా రామ్ దేవ్ కి ప్రమాదమా?
బాబా రామ్ దేవ్ కి ప్రమాదమా?
Published Thu, Jul 17 2014 11:06 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
యోగ గురు బాబా రామ్ దేవ్ ఉత్తరాఖండ్ లో ప్రమాదానికి గురయ్యారన్నవార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉన్న ఆయన కొండచరియలు విరిగిపడి ప్రమాదానికి గురయ్యారన్న కథనాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యగణం, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఉత్తరాఖండ్ లో భారీ వానలు, వరదలు వస్తున్న నేపథ్యంలో ఆయన క్షేమంగానే ఉన్నారని ఆశ్రమ వర్గాలు ప్రత్యేక బులెటిన్ విడుదల చేసి ప్రకటించింది. బాబా క్షేమంగా ఉన్నారని, ఉత్తరకాశీలోని ఆశ్రమంలో దాదాపు 400 మంది శిష్యులతో కలిసి ఉన్నారని, ఆయన గురించి దిగులు చెందనక్కర్లేదని ఆశ్రమం వర్గాలు తెలియచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement