గర్భిణి అయినా పనిచేస్తాను | Ready to work even when I'm pregnant: Rani Mukherji | Sakshi
Sakshi News home page

గర్భిణి అయినా పనిచేస్తాను

Published Fri, Aug 22 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

గర్భిణి అయినా పనిచేస్తాను

గర్భిణి అయినా పనిచేస్తాను

ముంబై: పెళ్లయినంత మాత్రాన తన సినిమా కెరీర్‌కు వచ్చే ఇబ్బందులేవీ లేవని రాణీ ముఖర్జీ అంటోంది. దర్శకుడు ఓకే అంటే గర్భంతోనైనా షూటింగ్‌కు వస్తానని చెప్పింది. మామూలుగా అయితే పెళ్లయిన తరువాత హీరోయిన్లు సినిమాలు తగ్గించుకుంటారు. తాను అలా చేయబోనని చెప్పిన రాణి.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధిపతి ఆదిత్య చోప్రాను ఏప్రిల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘హాలీవుడ్‌లో అయితే గర్భంతో ఉన్నప్పుడు కూడా పనిచేస్తారు. మనదేశంలో పెళ్లి కాగానే హీరోయిన్లు సినిమాలకు దూరమవుతారు. దర్శకుడు సరే అంటే నేను గర్భంతో ఉన్నా నటిస్తాను’ అని వివరించింది.

రాణి గర్భవతి అంటూ వచ్చిన వార్తలను ఈ బెంగాలీ బ్యూటీ తోసిపుచ్చింది. అయితే పెళ్లయిన హీరోయిన్లకు భర్త సహకారం చాలా అవసరమని ఒప్పుకుంది. ‘ఆదిత్య అన్ని విధాలా సహకరిస్తాడు. నేను తల్లిని అయిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటామో ఇప్పటికైతే తెలియదు. అయితే నాకు నటన అంటే చాలా ఇష్టం. కొందరు హీరోయిన్లు పెళ్లయిన తరువాత సన్నిహిత దృశ్యాలు, లిప్‌లాక్ సీన్లలో నటించేందుకు ఇబ్బందిపడుతారు. నాకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏవీ లేవు.

ఇటువంటి సమస్యలు హీరోయిన్ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఏర్పడుతాయి. నేను పెళ్లి చేసుకున్నది నిర్మాతను కాబట్టి అతని ఆలోచనా విధానం ఆధునికంగా ఉంటుంది. నా సినిమా విషయాల్లో ఆదిత్య జోక్యం చేసుకుంటాడని అనుకోవడం లేదు’ అని వివరించింది. కెరీర్‌పై వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, హిట్ అయితే ప్రశంసలు, ఫ్లాప్ అయితే విమర్శలు సహజమేనని రాణి చెప్పింది. ఇక ఈమె తాజా చిత్రం మర్దానీ కాగా, దీనిని భర్తే నిర్మించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో రాణి ఇన్‌స్పెక్టర్‌గా కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement