ఇటలీలో రహస్యంగా పెళ్లి! | Secrete Marriage at Italy! | Sakshi
Sakshi News home page

ఇటలీలో రహస్యంగా పెళ్లి!

Apr 22 2014 11:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఇటలీలో రహస్యంగా పెళ్లి! - Sakshi

ఇటలీలో రహస్యంగా పెళ్లి!

కథానాయికల కెరీర్‌కి పెళ్లి ప్రతిబంధకం అంటుంటారు. అయితే.... ఇది దక్షిణాది కథానాయికలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే... పెళ్లి చేసుకుని కూడా స్టార్లుగా చలామణీ అవ్వొచ్చని బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ నిరూపించారు.

కథానాయికల కెరీర్‌కి పెళ్లి ప్రతిబంధకం అంటుంటారు. అయితే.... ఇది దక్షిణాది కథానాయికలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే... పెళ్లి చేసుకుని కూడా స్టార్లుగా చలామణీ అవ్వొచ్చని బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ నిరూపించారు. ప్రస్తుతం బాలీవుడ్ భామలందరికీ ఈ ఇద్దరే ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకుని యథేచ్ఛగా ఇష్టమైన వారితో డేటింగులు చేసేసి, అవసరమైతే పెళ్లి పీటలు కూడా ధైర్యంగా ఎక్కేస్తున్నారు బాలీవుడ్ కథానాయికలు. ప్రస్తుతం రాణీ ముఖర్జీ అలాంటి పనే చేశారు. ఎంతో కాలంగా దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ... రాత్రికి రాత్రి ఆదిత్యతో మూడు ముళ్లు వేయించేసుకుని దేశం మొత్తానికి ఓ తీయని షాక్ ఇచ్చారు.
 
 వివరాల్లోకెళితే.. యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాకు, రాణీ ముఖర్జీకి మధ్య ఎఫైర్ నడుస్తోందని కొన్నేళ్లుగా బాలీవుడ్  మీడియా కోడై కూస్తూనే ఉంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని పలు సందర్భాల్లో ఆదిత్య, రాణీ ముఖర్జీ ఖండించారు కూడా. అయితే  అందరికీ షాకిస్తూ మొన్న సోమవారం ఇటలీలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో అతి నిరాడంబరంగా ఇద్దరూ పెళ్లి తంతును కానిచ్చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆదిత్య చోప్రాది గౌరవప్రదమైన స్థానం. ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ లాంటి క్లాసిక్‌ని రూపొందించిన దర్శకుడాయన.
 
 అలాంటి ప్రముఖుణ్ణి ఇలా రహస్యంగా రాణీ వివాహం ఆడటం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే... ఎట్టకేలకు తన వివాహం విషయాన్ని నేడు మీడియా ముందు బయటపెట్టారు రాణీ ముఖర్జీ. ‘‘ఇన్నాళ్లూ నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఓ మంచి వ్యక్తితో నా పెళ్లి జరిగింది. నన్ను ఇష్టపడేవారందరికీ నేను చెబుతున్న గొప్ప శుభవార్త ఇదే. యశ్‌చోప్రా అంకుల్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా... ఆయన దీవెనలు మాత్రం మా దంపతులకు తప్పకుండా ఉంటాయి’’ అని ఆనందం వెలిబుచ్చారామె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement