రాణీ రీ–ఎంట్రీ | Rani Mukherjee re-entry | Sakshi
Sakshi News home page

రాణీ రీ–ఎంట్రీ

Published Tue, Feb 28 2017 11:03 PM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

రాణీ రీ–ఎంట్రీ - Sakshi

రాణీ రీ–ఎంట్రీ

బాలీవుడ్‌ బ్యూటీ రాణీ ముఖర్జీ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. 2014లో ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్న రాణీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా ‘హిచ్‌కీ’ సినిమాతో ఆమె రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు.

సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై మనీష్‌ శర్మ నిర్మించనున్న ఈ చిత్రంలో రాణీ ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్‌.తన బలహీనతలను ఓ మహిళ బలంగా ఎలా మార్చుకుంది? అన్నదే కథాంశం. ‘‘పాజిటివ్‌ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా’ అన్నారు రాణీ ముఖర్జీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement