కూతురితో... భర్త సినిమాలో రీ-ఎంట్రీ? | Husband with a daughter in the movie re-entry? | Sakshi
Sakshi News home page

కూతురితో... భర్త సినిమాలో రీ-ఎంట్రీ?

Published Thu, May 26 2016 11:31 PM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

కూతురితో... భర్త సినిమాలో   రీ-ఎంట్రీ? - Sakshi

కూతురితో... భర్త సినిమాలో రీ-ఎంట్రీ?

గాసిప్


బాలీవుడ్ కథానాయిక రాణీముఖర్జీ మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా...? హిందీ పరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మర్దాని’ తర్వాత రాణీ ముఖర్జీ మళ్లీ తెరపై కనిపించలేదు. దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రాని పెళ్లి చేసుకోవడం, ఓ పాపకు కూడా జన్మనివ్వడంతో ఇక రాణి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ, అందరి ఊహాగానాలకు భిన్నంగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేస్తున్నారు.


అది కూడా తన భర్త ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ‘బేఫికర్’లో నటించనున్నారు. రణ్‌వీర్‌సింగ్, వాణీ కపూర్ జంటగా రూపొందుతున్న  ఈ చిత్రంలో రాణీముఖర్జీ తన కూతురితో కలిసి తెరపై కనబడటానికి సిద్ధమవుతున్నారు. విశేషమేమిటంటే,  ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు భార్యా, కూతురూ కలిసి కనిపించే సన్నివేశంలో ఆదిత్యా చోప్రా కూడా కనిపిస్తారట.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement