hicki
-
చైనాలో ‘రాణీ’స్తోన్న హిచ్కీ
కెరియర్ తొలి నాళ్లలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం తమ పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు నటి రాణీ ముఖర్జీ. ఈ ఏడాది మార్చిలో ‘హిచ్కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాణి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం రూ. 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ 100 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు రాణి ముఖర్జీ తెలిపారు. కంటెంట్ ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. సిద్థార్థ్ మల్హోత్రా దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో రాణి టీచర్ కావాలనే బలమైన లక్ష్యం...కానీ నోరు తెరచి ఏ మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు...అన్ని అడ్డంకులు దాటుకొని లక్ష్యం చేరుకునే మహిళ నైనా మాథుర్ పాత్రలో ఆకట్టుకున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ ‘ధూమ్3’, ‘దంగల్’, ‘పీకే’, ‘సీక్రెట్ సూపర్ స్టార్స్’, సల్మాన్ ఖాన్ ‘బజరంగి భాయిజాన్’ చిత్రాలు చైనా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. -
పరీక్ష వాయిదా
‘‘పిల్లలూ... మీ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాకే మా సినిమాను విడుదల చేస్తాం’’ అంటున్నారు ‘హిచ్కీ’ చిత్రబృందం. నాలుగేళ్ల తర్వాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హిచ్కీ’. టురెట్స్ సిండ్రోమ్ (పదే పదే కళ్లార్పడం, రాని దగ్గు దగ్గడం, నత్తిగా మాట్లాడటం, పదే పదే వెక్కిళ్లు రావడం వంటి లక్షణాలు) తో బాధపడుతున్న టీచర్ పాత్రలో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. మన గోల్స్ నెరవేర్చుకోవటానికి మన బలహీనతలను బలంగా మార్చుకొని ఎలా ముందుకు సాగాలి? అని స్టూడెంట్స్‌ను మోటివేట్ చేసే కథాంశంతో సిద్ధార్ధ్ పి. మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక నెల ఆలస్యంగా మార్చి 23న విడుదల చేయనున్నారు. ‘‘మార్చి నెలతో అందరి బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ సినిమా కథ టీచర్, స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. సో.. ఫిబ్రవరి కంటే మార్చిలో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని ఈ డేట్‌కు షిప్ట్ చేసుకున్నాం. అంతే కానీ ఎటువంటి క్లాష్ వల్ల, ఫెస్టివల్స్ కారణంగా కాదు’’ అని రిలీజ్ డేట్ మార్పు గురించి నిర్మాత మనీష్ శర్మ పేర్కొన్నారు. సో... స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం వీరి ఎగ్జామ్ (‘హిచ్కీ’)ను పోస్ట్‌పోన్ చేసుకున్నారన్నమాట. అంతే కదండీ.. ప్రతి సినిమా ఓ పరీక్షే. ఎంత మంచి సినిమా తీసినా యూనిట్‌కి ఆడియన్స్ చెప్పే రిజల్టే ముఖ్యం కదా. అందుకే మంచి టైమ్‌లో రిలీజ్ చేయాలనుకుంటారు. -
రాణీ రీ–ఎంట్రీ
బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. 2014లో ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్న రాణీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా ‘హిచ్కీ’ సినిమాతో ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ నిర్మించనున్న ఈ చిత్రంలో రాణీ ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్.తన బలహీనతలను ఓ మహిళ బలంగా ఎలా మార్చుకుంది? అన్నదే కథాంశం. ‘‘పాజిటివ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా’ అన్నారు రాణీ ముఖర్జీ.