రాణీ ముఖర్జీ
‘‘పిల్లలూ... మీ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాకే మా సినిమాను విడుదల చేస్తాం’’ అంటున్నారు ‘హిచ్కీ’ చిత్రబృందం. నాలుగేళ్ల తర్వాత రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘హిచ్కీ’. టురెట్స్ సిండ్రోమ్ (పదే పదే కళ్లార్పడం, రాని దగ్గు దగ్గడం, నత్తిగా మాట్లాడటం, పదే పదే వెక్కిళ్లు రావడం వంటి లక్షణాలు) తో బాధపడుతున్న టీచర్ పాత్రలో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. మన గోల్స్ నెరవేర్చుకోవటానికి మన బలహీనతలను బలంగా మార్చుకొని ఎలా ముందుకు సాగాలి? అని స్టూడెంట్స్‌ను మోటివేట్ చేసే కథాంశంతో సిద్ధార్ధ్ పి.
మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక నెల ఆలస్యంగా మార్చి 23న విడుదల చేయనున్నారు. ‘‘మార్చి నెలతో అందరి బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ సినిమా కథ టీచర్, స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. సో.. ఫిబ్రవరి కంటే మార్చిలో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని ఈ డేట్‌కు షిప్ట్ చేసుకున్నాం.
అంతే కానీ ఎటువంటి క్లాష్ వల్ల, ఫెస్టివల్స్ కారణంగా కాదు’’ అని రిలీజ్ డేట్ మార్పు గురించి నిర్మాత మనీష్ శర్మ పేర్కొన్నారు. సో... స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం వీరి ఎగ్జామ్ (‘హిచ్కీ’)ను పోస్ట్‌పోన్ చేసుకున్నారన్నమాట. అంతే కదండీ.. ప్రతి సినిమా ఓ పరీక్షే. ఎంత మంచి సినిమా తీసినా యూనిట్‌కి ఆడియన్స్ చెప్పే రిజల్టే ముఖ్యం కదా. అందుకే మంచి టైమ్‌లో రిలీజ్ చేయాలనుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment