సుశాంత్​ కేసు: స్టేట్​మెంట్​ ఇచ్చిన చోప్రా | aditya chopra gives statement to mumbai police in sushant singh rajput death | Sakshi
Sakshi News home page

సుశాంత్​ కేసు: స్టేట్​మెంట్​ ఇచ్చిన చోప్రా

Published Sat, Jul 18 2020 3:59 PM | Last Updated on Sat, Jul 18 2020 8:19 PM

aditya chopra gives statement to mumbai police in sushant singh rajput death - Sakshi

ముంబై: సుశాంత్​ సింగ్ రాజ్​పుత్(34)​ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఫిల్మ్​మేకర్​ ఆదిత్య చోప్రా స్టేట్​మెంట్​ను శనివారం రికార్డు చేశారు. వెర్సోవా పోలీసు స్టేషన్​కు వచ్చిన ఆదిత్య నుంచి బాంద్రా పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. ఆదిత్య స్టేషన్​లో నాలుగు గంటల పాటు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. (నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!)

గత నెల 14న సుశాంత్​ సింగ్​ తన అపార్టుమెంటులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో సహా 34 మందిని విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై పోలీసులను ఆదేశించింది. (5‌ స్టార్‌ హోటల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రిలాక్స్‌!)

శుక్రవారం సుశాంత్​ సింగ్ సైక్రియార్టిస్టు డా.కేర్సి చవ్డా స్టేట్​మెంట్​ను సైతం పోలీసులు రికార్డు చేశారు. మరో ముగ్గురు డాక్టర్లతో కూడా సుశాంత్​ సింగ్​ ఆరోగ్యంపై వాకబు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement