
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తండ్రి రామ్ ముఖర్జీ (84) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో రామ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఆరేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో రాణీ ముఖర్జీ సినిమాలు వదులుకొని మరి తండ్రి వద్దే ఉన్నారు.
అంతేకాదు తండ్రికోసమే రాణీ ముఖర్జీ 2012లో నిర్మాత ఆదిత్య చోప్రాను హడావిడిగా వివాహం చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. సినీ రంగానికి సుపరిచితుడైన రామ్ ముఖర్జీ హిందీ, బెంగాలీ చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment