Rani Mukerji-Kajol: అక్కా-చెల్లెలు ఇద్దరు స్టార్‌ హీరోయిన్లే..కొన్నేళ్లుగా మాటల్లేవు, కారణం ఇదేనట! | Rani Mukerji Opens Up About Her Differences With Actor-Cousin Kajol; Here Reason - Sakshi
Sakshi News home page

Rani Mukerji-Kajol Feud: అపార్ధం చేసుకున్నాం.. అందుకే కాజోల్‌తో మాట్లాడలేదు: రాణీ ముఖర్జీ

Published Tue, Apr 23 2024 7:00 PM | Last Updated on Fri, Apr 26 2024 6:36 PM

Rani Mukerji Opens Up About Her Differences With Cousin Kajol - Sakshi

రాణీ ముఖర్జీ, కాజోల్ బాలీవుడ్‌ ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వరుసకు వీరిద్దరు అక్కా-చెల్లెలు అవుతారు. ఇప్పుడంటే కాజోల్‌, రాణీముఖర్జీ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు కానీ.. కొన్నాళ్ల క్రితం వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలిసి ఒకే సినిమాలో(కరణ్ జోహార్ మొదటి చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై') నటించినా మాట్లాడుకోలేదట. దానికి గల కారణాన్ని తాజాగా రాణీ ముఖర్జీ వెల్లడించింది. అపార్దం చేసుకోవడం వల్లే తాము కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నామని చెప్పింది. 

‘ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు సహజం.  విభేదాలకు ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే విడిపోతారు. అలాంటిదే మా(కాజోల్‌, రాణీ ముఖర్జీ) ఫ్యామిలీలో జరిగింది. మా ఇరు కుటుంబాలు విడిపోవడానికి కారణమే లేదు.  అపార్దం చేసుకోవడం వల్లే మేము కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా రెండు కుటుంబాలు కలిశాయి. ఏదో ఒక సందర్భంలో అందరం కలుస్తూనే ఉంటాం’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. 

కాజోల్‌ కంటే ఆమె చెల్లి తనిషా ముఖర్జీ తనకు బాగా క్లోజ్‌ అని రాణీ ముఖర్జీ గతంలో చెప్పింది. ’చిన్నప్పుడు అందరం కలిసే ఆడుకునేవాళ్లం. తనిషా, నేను ఒక జట్టు అయితే.. మా సోదరుడు, కాజోల్‌ మరో గ్యాంగ్‌. మా సీక్రెట్స్‌ ఏవి వారితో షేర్‌ చేసుకునే వాళ్లం కాదు. కాజోల్‌ మాత్రం ఎక్కువగా మా సోదరులతోనే ఉండేది. చిన్నప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు’ అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement