తెలుగు సినిమాలకు ధూమ్ 3 టెన్షన్
తెలుగు సినిమాలకు ధూమ్ 3 టెన్షన్
Published Wed, Dec 4 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
ఆమిర్‌ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్‌లాంటి సూపర్‌స్టార్లు నటించిన ‘ధూమ్ 3’ సినిమా కోసం బాలీవుడ్ వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ఈ నెల 20న రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ధూమ్ 3’ దెబ్బకి చాలా హిందీ సినిమాల రిలీజ్‌లు వెనక్కు వెళ్లిపోయాయి. చివరకు టాలీవుడ్‌ని కూడా ‘ధూమ్ 3’ కలవరపెడుతోంది. ఈ నెల మూడో వారంలో విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డాయి. ‘ధూమ్ 3’ ప్రధాన నగరాల్లోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లోనూ విడుదలవుతుంది కాబట్టి, మన తెలుగు సినిమాలకు థియేటర్లు దొరికే అవకాశం తక్కువ. అందుకే మరో వారానికి తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. దానికితోడు యశ్‌రాజ్ సంస్థ ‘ధూమ్ 3’ని తెలుగులో డబ్ కూడా చేసింది. తమిళ్ సినిమాల తరహాలోనే భవిష్యత్తులో హిందీ సినిమాలు కూడా టాలీవుడ్ మార్కెట్‌ని కొల్లగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Advertisement
Advertisement