5 కోట్ల రూపాయల పాటలో ఆమిర్, కత్రినా! | DHOOM 3: 5 crore for Aamir Khan-Katrina Kaif's new song 'Malang' | Sakshi
Sakshi News home page

5 కోట్ల రూపాయల పాటలో ఆమిర్, కత్రినా!

Published Mon, Nov 25 2013 11:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

5 కోట్ల రూపాయల పాటలో ఆమిర్, కత్రినా! - Sakshi

5 కోట్ల రూపాయల పాటలో ఆమిర్, కత్రినా!

నాలుగైదు చిన్న సినిమాలకయ్యే ఖర్చుతో ఓ పాట తీస్తే? ఆ పాట ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరించింది ‘ధూమ్ 3’ కోసం. ఆమిర్‌ఖాన్, అభిషేక్‌బచ్చన్, ఉదయ్‌చోప్రా, కత్రినాకైఫ్ ముఖ్య తారలుగా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పాట చిత్రీకరణ జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఇంత ఖర్చుపెట్టి తీసిన పాట లేదని, ఆ ఘనత ఈ పాటకే దక్కుతుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. 
 
 ఆమిర్, కత్రినా కాంబినేషన్‌లో తీసిన ఈ పాటలో 200మంది జిమ్నాస్టిక్ కళాకారులు కూడా పాల్గొన్నారు. వీళ్లని ప్రత్యేకంగా యూఎస్ నుంచి రప్పించారట. అలాగే పలువురు ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఈ పాటకు కాలు కదిపారని సమాచారం. పాట కోసం వేసిన సెట్స్ అయితే కళ్లు చెదిరిపోయేంత అందంగా ఉన్నాయని, ఈ తరహా సెట్స్‌ని ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూడలేదని వినికిడి. సెట్స్ తయారీకి దాదాపు రెండు నెలలు పట్టిందట. సుమారు 20 రోజుల పాటు ఈ చిత్రీకరణ జరిగనట్లు బాలీవుడ్ టాక్. ‘ధూమ్ 3’లో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉండి ఉంటాయని, వాటిలో ప్రముఖ స్థానం ఈ పాటదే అయ్యుంటుందని చెప్పొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement