
డిష్యుం డిష్యుం... దీపికా!
గాసిప్
అందాల తార దీపిక పడుకొనే, కండల హీరో హృతిక్ రోషన్ సరసన నటించనుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పూర్తి వివరాలేవి ప్రకటించలేదు. అయితే ‘ధూమ్3’ ఫేమ్ విజయ్ క్రిష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట.
ఎక్స్‌పర్ట్ హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్లు పనిచేయనున్న ఈ సినిమాలో హృతిక్ మాత్రమే కాదు దీపిక కూడా స్టంట్ దృశ్యాలు చేయనుందట. ‘చాందిని చౌక్’ తరువాత దీపిక యాక్షన్ అవతార్‌లో కనిపించే రెండో సినిమా ఇదే అవుతుంది.