గృహ నిర్బంధం చేసి.. అమీర్ ఖాన్ డగ్స్ ఇస్తున్నారా?
గృహ నిర్బంధం చేసి.. అమీర్ ఖాన్ డగ్స్ ఇస్తున్నారా?
Published Fri, Jan 3 2014 5:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
మానసిక వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడిని గృహ నిర్బంధంలో ఉంచి బలవంతంగా మాత్రలు మింగిస్తున్నారని వచ్చిన ఆరోపణలను మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఖండించారు. తన తమ్ముడు ఫైజల్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది. తన చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేయడంలో ఫైజల్ సహకరిస్తున్నారు అని అమీర్ తెలిపారు. తన తమ్ముడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమే అని అన్నారు.
ధూమ్-3 చిత్ర స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఫైజల్ దే కీలక పాత్ర అని అన్నారు. ఫైజల్ సూచన మేరకే తాను ధూమ్-3 చిత్రాన్ని అంగీకరించాను అని అమీర్ తెలిపారు. రానున్న రోజుల్లో సినిమాల్లో నటించే విషయంపై ఫైజల్ ను అడిగి తెలుసుకోవాల్సిందే అని అన్నారు. ధూమ్-3 చిత్ర విజయంతో తనలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని అమీర్ తెలిపారు.
Advertisement
Advertisement