ఓవర్సీస్‌ రికార్డ్‌: బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..! | Spyde Overseas Collection record | Sakshi
Sakshi News home page

బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..!

Published Wed, Sep 27 2017 4:45 PM | Last Updated on Wed, Sep 27 2017 5:02 PM

Spyder

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్ సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మూడు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే స్పైడర్ పది లక్షల డాలర్లు వసూళు చేసినట్టుగా ఫోర్బ్స్ సంస్థ ఓ వార్తలో పేర్కొంది. వారాంతంలో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ అయి ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా స్పైడర్ రికార్డ్ సృష్టించింది. స్పైడర్ కన్నా ముందు ధూమ్ 3, బాహుబలి 2 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవటంతో తొలివారాంతనికి స్పైడర్ మరిన్ని రికార్డ్ లు బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement