సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తమిళ ఆడియన్స్ కు పరవాలేదనిపించినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ సాధించినా.. బ్రేక్ ఈవెన్ కు రావటం కష్టమనే భావిస్తున్నారు.
అయితే నిర్మాత కష్టాలను దృష్టిలో పెట్టుకోని మహేష్ మరోసారి తన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బ్రహ్మోత్సవం సినిమా సమయంలో కూడా మహేష్ తన పారితోషికాన్ని తిరిగిచ్చేసి నిర్మాతలను ఆదుకున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన స్పైడర్ కు మహేష్ 20 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నాడన్న వార్తలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment