brahmothsavam
-
బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
కర్నూలు : శ్రీశైలం బ్రహ్మోత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కర్నూలు జిల్లాతో పాటుౖ వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల పోలీసులను నియమించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసు అధికారుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన 2 వేల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటారు. కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, హోంగార్డు కమాండెంట్‌తో పాటు 14 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 116 మంది ఎస్ఐలు, 894 మంది కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 409 మంది హోంగార్డులు, 25 సెక్షన్ల ఏఆర్ ప్లటూన్లు, 4 ప్లటూన్ల ఏపీఎస్పీ బృందాలు, 12 స్పెషల్ పార్టీ బృందాలతో పాటు బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ మఫ్టీ పోలీసు బృందాలను కూడా నియమించారు. ఫారెస్ట్‌లోకొనసాగుతున్న కూంబింగ్... అధిక శాతం భక్తులు కాలినడకన వెళ్తున్నందున ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు సాయుధ బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మొత్తం సాయుధ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈనెల 15 వరకు స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పోలీసు శాఖ ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలం ఘాట్‌లో వెళ్లే వాహనాలు ఫిట్నెస్(సామర్థ్యం) పత్రాలు కలిగి ఉంటేనే అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌లోడ్‌తో వెళ్లకుండా చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించారు. కాలినడకన వెళ్లే భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. తప్పిపోయినవారి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షణకు ఇద్దరు డీఎస్పీలను నియమించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా, బాడీ ఓన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. -
మహేష్ తిరిగిచ్చేశాడు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తమిళ ఆడియన్స్ కు పరవాలేదనిపించినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ సాధించినా.. బ్రేక్ ఈవెన్ కు రావటం కష్టమనే భావిస్తున్నారు. అయితే నిర్మాత కష్టాలను దృష్టిలో పెట్టుకోని మహేష్ మరోసారి తన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బ్రహ్మోత్సవం సినిమా సమయంలో కూడా మహేష్ తన పారితోషికాన్ని తిరిగిచ్చేసి నిర్మాతలను ఆదుకున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన స్పైడర్ కు మహేష్ 20 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నాడన్న వార్తలు వినిపించాయి. -
వీరేశ్వరుని బ్రహ్మోత్సవం
కన్నుల పండువగా ప్రారంభం ఐ.పోలవరం : నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోన్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈపూజా కార్యక్రమం శైవాగమ పద్ధతిలో శైవాగమ పండిట్ స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల పర్యవేక్షణలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామి వారికి అభిషేకం, స్వామి, అమ్మవారిని నూతన వధూవరూలను సంప్రదాయ పద్ధతిలో చేశారు. పండితులు, స్వామి, అమ్మవారికి అలంకరించే పట్టు వస్త్రాలను జంపన రామకృష్ణంరాజు దంపతులు అందించారు. గ్రామంలోని మహిళలు పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి పసుపును తయారు చేశారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి, అమ్మవారికి స్నానాలు చేయించారు. అనంతరం సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, సాయంత్రం అయ్యవారిని, అమ్మవారిని భద్ర పీఠంపై ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవం జరిగింది. అనంతరం ఎదురు సన్నాహం, స్వామివారిని ద్వాదశ ప్రదక్షణగా ఆలయ ప్రదిక్షణ చేశారు. స్వామి, అమ్మవారికి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరు అయ్యారు. ఆలయ చైర్మ¯ŒS జంపన భీమరాజు, ఈఓ బళ్ల నీలకంఠం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాన్ని పురస్కరించుకుని హిందూపురంలోని పళనీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో స్థిరపడిన తమిళులు, కేరళీయులు ఆదివారం పెద్ద ఎత్తున భక్తిపారవశ్యంలో మునిగితేలారు. కార్తికేయుడిపై ఉన్న తమ భక్తికి పరాకాష్టగా శరీరాలకు కొక్కెలు తగిలించుకుని విల్లక్కు రథాలకు వేలాడారు. కావడిలు మోస్తూ శరీరానికి శూలాలు, అంబులు గుచ్చుకున్నారు. అంతకు ముందు 21 రోజులుగా సుబ్రహ్మణ్యేశ్వరుడి మాలాధారణతో వ్రతం చేశారు. మొక్కులో భాగంగా కొందరు తమ చెంపకు శూలాలు గుచ్చుకోగా, మరికొందరు కొక్కెలు తగిలుంచుకుని గంటలు, నిమ్మకాయలను వేలాడదీశారు. మరికొందరు శరీరానికి గుచ్చుకున్న కొక్కెలతో ఆటోలు, రాతి రోళ్లు లాగారు. ఉత్సవ ఊరేగింపు పళనీనగర్ నుంచి బెంగళూరు రోడ్డు, చిన్నమార్కెట్, గాంధీ సర్కిల్, మెయిన్ రోడ్డు మీదుగా పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, టీడీపీ నేత అంబికా లక్ష్మినారాయణ, సంఘం నాయకులు వేలు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. - హిందూపురం అర్బన్