సీబీఐకి బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు! | CBI starts probing Jiah Khan death | Sakshi
Sakshi News home page

సీబీఐకి బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు!

Published Wed, Aug 13 2014 9:28 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

సీబీఐకి బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు! - Sakshi

సీబీఐకి బాలీవుడ్ నటి జియా ఖాన్ కేసు!

ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ మరణం కేసు సంబంధించిన విచారణను సీబీఐ ప్రారంభించింది. జియా ఖాన్ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఐదు వారాల క్రితం బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 
 
జియా ఖాన్ మరణం ఆత్మహత్యే అనే విషయం తేలితే .. అందుకు కారణాలేంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తారని.. ఆతర్వాత అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని బాంబే కోర్టు న్యాయమూర్తులు వీఎం కనాడే, పీడీ కోడే వెల్లడించారు. 
 
అమెరికా పౌరురాలైన జియాఖాన్ గత సంవత్సరం జూలై 3 తేదని ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement