'బాలీవుడ్ తార జియాఖాన్ ది హత్యే' | Bombay High Court orders fresh investigation on Jiah Khan Suicide Case | Sakshi
Sakshi News home page

'బాలీవుడ్ తార జియాఖాన్ ది హత్యే'

Published Wed, Oct 23 2013 9:48 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

'బాలీవుడ్ తార జియాఖాన్ ది హత్యే' - Sakshi

'బాలీవుడ్ తార జియాఖాన్ ది హత్యే'

సంచలనం రేపిన బాలీవుడ్ తార జియా ఖాన్ ఆత్మహత్య కేసులో తాజాగా దర్యాప్తు చేపట్టాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. తన కూతురును హత్య చేశారని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని  జియాఖాన్ తల్లి రుబియా ఖాన్ బాంబే హైకోర్టులో అక్టోబర్ 1 తేదిన పిటిషన్ దాఖలు చేశారు. 
 
జియాఖాన్ హత్య చేసి.. ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించారని జియాఖాన్ తల్లి పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. తన వాదనలకు బలం చేకూరే విధంగా స్వతంత్ర ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్ట్ ను పిటిషన్ తోపాటు అందచేశారు. ఈ కేసులో నిందితుడు సూరజ్ పంచోలికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రుబియా ఖాన్ డిమాండ్ చేశారు. సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి  పోలీసులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement