'జియాఖాన్ ఆత్మహత్యపై ఇప్పుడేం మాట్లాడలేను' | Will speak on Jiah's case once it is cleared: Sooraj Pancholi | Sakshi
Sakshi News home page

'జియాఖాన్ ఆత్మహత్యపై ఇప్పుడేం మాట్లాడలేను'

Published Wed, Dec 23 2015 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

Will speak on Jiah's case once it is cleared: Sooraj Pancholi

ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్యపై మాట్లాడటానికి ఆమె మాజీ ప్రియుడు, బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలి నిరాకరించాడు. గిల్డ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను బుధవారం పాత్రికేయులు జియాఖాన్ ఆత్మహత్య కేసుపై ప్రశ్నించగా..' జీవితంలో పైకి లేవడం కిందపడటం సాధారణమే, దేవుడు చాలా గొప్పవాడు' అంటు వేదాంతం అందుకున్నాడు. ఈ కేసు గురించి పదిమంది పది రకాలుగా అనుకుంటున్నారు. కేసు విచారణ కోర్టులో ఉన్నందున దీనిపై ఇప్పడేం మాట్లాడలేను అని జారుకున్నాడు.

కాగా సూరజ్ పంచోలీ మోసం చేయడం మూలంగానే జియాఖాన్ తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని డిసెంబర్ 9న సీబీఐ ఛార్జ్షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement