ఒక్క సినిమా సీనియర్ అంటున్న హీరోయిన్ | Sooraj Pancholi wants do a film with Jacqueline | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమా సీనియర్ అంటున్న హీరోయిన్

Feb 18 2016 6:54 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఒక్క సినిమా సీనియర్ అంటున్న హీరోయిన్ - Sakshi

ఒక్క సినిమా సీనియర్ అంటున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి తనకు నటించాలని ఉందని 'హీరో' ఫేమ్ సూరజ్ పంచోలి అంటున్నాడు.

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి తనకు నటించాలని ఉందని 'హీరో' ఫేమ్ సూరజ్ పంచోలి అంటున్నాడు. 'జీఎఫ్ బీఎఫ్' అనే వీడియో సాంగ్ లో వారిద్దరూ ఇటీవలే కలిసి పనిచేశారు. శ్రీలంక భామతో కలిసి నటించాలని ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సూరజ్ ఈ విధంగా బదులిచ్చాడు. ఆమెతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందన్నాడు. ఆమె ఎప్పడూ తాను సీనియర్ అనే విధంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు సూరజ్. తాను సూరజ్ కంటే కేవలం ఒక్క సినిమా సీనియర్ ను మాత్రమే అని జాక్వెలిన్ చెప్పి చిన్నగా నవ్వేసింది.

వీడియో సాంగ్ కోసం సూరజ్ చాలా శ్రమపడ్డాడని.. అతడితో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని అభిప్రాయపడింది. జాక్వెలిన్ ఇటీవలే ఓ పాట కోసం గొంతు సవవరించుకుని సింగర్ అవతారమెత్తిన విషయం తెలిసిందే. నిర్మాత భూషణ్ కుమార్ ఆ పాట పాడాలని తనను అడగలేదట. పాట పాడుతున్నావ్ ఇక అంతే అని చెప్పారని 'బ్రదర్స్' ఫేమ్ జాక్వెలిన్ వివరించింది. తన తండ్రి డీజే అని, మ్యూజిక్ ప్రపంచంలోనే పెరిగినప్పటికీ పాట మాత్రం పాడలేదంటోంది. అందుకే ఇది చాలా గొప్ప అవకాశమని హీరోయిన్ చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement