'మా అమ్మతో నటించాలని ఉంది' | Want my mother to do next film with me: Sooraj Pancholi | Sakshi

'మా అమ్మతో నటించాలని ఉంది'

Mar 20 2016 7:51 PM | Updated on Aug 28 2018 5:25 PM

'మా అమ్మతో నటించాలని ఉంది' - Sakshi

'మా అమ్మతో నటించాలని ఉంది'

బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

దుబాయ్: బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తర్వాతి సినిమాలో తన తల్లి, సీనియర్ నటి జరీనా వహబ్ తో నటించాలని ఉందని వెల్లడించాడు. 25 ఏళ్ల సూరజ్ ఉత్తమ నూతన కథానాయకుడిగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు(టీఓఐఎఫ్ఏ) అందుకున్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'నేను నటించబోయే తర్వాతి సినిమాలో ఆమె(జరీనా వహబ్) ఉండాలని కోరుకుంటున్నా. నా సినిమాలో నటించమని అడగ్గా సమయం ఉంటే తప్పకుండా నటిస్తానని మాటిచ్చింద'ని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని తెలిపాడు. జాక్వెలెస్ ఫెర్నాండెజ్ తో కలిసి అతడు నటించి మ్యూజిక్ వీడియో 'జీఎఫ్ బీఎఫ్'ను యూట్యూబ్ లో కోటి 50 లక్షల మంది వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement